BRO Movie : పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా జూలై 28న విడుదలై కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే ఇవ్వడం విశేషం.
తమిళ్ సినిమా అయినా వినోదయ సీతం కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని దర్శకుడు సముద్రఖని కేవలం 21 రోజుల్లో పూర్తి చేసారు. ఫ్యామిలీ సెంటిమెంట్ కి కూడా పెద్ద పీటే వేశారు దర్శకుడు.
ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ చెల్లెలుగా నటించిన ఇద్దరు కూడా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించారు. వీరిద్దరూ పెద్ద సుపరిచితులు కాకపోయినా ఈ సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇద్దరు చెల్లెళ్ల క్యారెక్టర్స్ లో నటించ్చిన వారి పేరు ప్రియప్రకాష్ వారియర్, యువలక్ష్మి.
అయితే సెకండ్ హాఫ్ లో ఎక్కువగా కథ చిన్న చెల్లెలి చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రలో మనకు యువలక్ష్మి అనే అమ్మాయి కనిపించింది. అయితే ఈ అమ్మాయికి ఇదే మొదటి సినిమా కాదు. తాను చిన్నప్పటి నుంచి చాలా సినిమాలలో నటించింది.
తమిళ భాషలో ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, ఎన్నో సూపర్ హిట్ లు అందుకొని అక్కడ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక అక్కడ వరస ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ అమ్మాయి, ఎక్కువగా సముద్రఖని తమిళంలో దర్శకత్వం వహించిన సినిమాలలో ముఖ్య పాత్రలు పోషించింది. అయితే తెలుగులో మాత్రం యువలక్ష్మికి బ్రో నే మొదటి సినిమా. ఈ సినిమాకి కూడా సముద్రఖని దర్శకత్వం వహించడం మరో విశేషం.
ఇక ఈ సినిమాతో తెలుగులో కూడా సూపర్ హిట్ అందుకుంది ఈ నటి. ఈ అమ్మాయికి వస్తున్న ప్రశంసలు చూస్తూ ఉంటే, రాబోయే తెలుగు చిత్రాలలో తనకు తప్పకుండా ఎక్కువ అవకాశాలే వచ్చేటట్టు ఉన్నాయి. మరి తమిళంలో లాగా తెలుగులో కూడా వరుస ఆఫర్లు తెచ్చుకొని యువ లక్ష్మీ బిజీ అయిపోతుందో లేదో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.