Lal Salaam Movie Review: లాల్ సలామ్ మూవీ ఫుల్ రివ్యూ…

ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్టర్ గా సక్సెస్ అయిందా..? రజినీకాంత్ తన కూతురుకి ఒక హిట్ ఇచ్చాడా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : February 9, 2024 2:56 pm
Follow us on

Lal Salaam Movie Review:  రీసెంట్ గా రజినీకాంత్ జైలర్ సినిమాతో ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక అదే క్రమంలో ఆయన గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన లాల్ సలాం సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి రజనీకాంత్ కూతురైన ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. అయితే ఈ సినిమాతో ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్టర్ గా సక్సెస్ అయిందా..? రజినీకాంత్ తన కూతురుకి ఒక హిట్ ఇచ్చాడా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక ఊళ్ళో ప్రతి సంవత్సరం ఒక జాతర జరుగుతూ ఉంటుంది. అందులో అందరూ చంపుకుంటూ ఉంటారు ఇలాంటి క్రమంలో వాళ్లందరూ ఎవరు చెప్పిన వినరు కానీ ఒక్క మొయినద్దిన్ (రజినీకాంత్) అనే ఒక ముస్లిం వ్యక్తి చెప్తే వింటారు. ఆయన చెప్తేనే వాళ్ళు ఎందుకు వింటారు. అసలు మొయినద్దిన్ ముంబైలో డాన్ గా కొనసాగుతూ ఇక్కడికి వచ్చి జనాలకి మంచి మాటలు చెబుతూ ఉంటాడు. అసలు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో కొంతవరకు నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక స్టొరీ లాగా చూసుకుంటే ఇది చాలా అద్భుతమైన స్టోరీ అయినప్పటికీ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లో మాత్రం తేడా కొట్టేసింది. ఇక ఇప్పటికే ఐశ్వర్య రజనీకాంత్ వాళ్ల నాన్న అయిన రజినీకాంత్ ను పెట్టీ కొచ్చాడియాన్ అనే ఒక సినిమా తీసింది. ఆ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా ఆమె అలాంటి తప్పే చేసింది. రజనీకాంత్ లాంటి ఒక స్టార్ హీరోని సినిమాలో పెట్టుకుని ఆయన క్యారెక్టర్ని బాగా డిజైన్ చేసుకున్నప్పటికీ స్క్రీన్ మీద డెలివరీ చేసే సమయంలో మాత్రం ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయలేదు.అలాగే సినిమాలో రజనీకాంత్ కు డబ్బింగ్ కూడా చాలా మైనస్ గా మారింది.ఎప్పుడు రజినీ కాంత్ కి మనో డబ్బింగ్ చెబుతూ ఉండేవాడు ఇప్పుడు కూడా ఆయన చేతే డబ్బింగ్ చెప్పిస్తే బాగుండేది. ఇక ఇది ఇలా ఉంటే స్క్రిప్ట్ లో కొన్ని ఫాల్స్ ఉన్నప్పటికీ వాటిని స్క్రీన్ ప్లే తో చేదించాల్సింది కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ పరంగా కూడా ఈ సినిమా ఎక్కడ ఏ ప్రేక్షకుడిని కూడా ఎంగేజ్ చేసే విధంగా అయితే కనిపించలేదు…సినిమా నడుస్తూనే ఉంటుంది కానీ ప్రేక్షకుడు ఆ సినిమాకి కమిట్ అవ్వకపోవడం వల్ల ఆ సినిమా ప్రేక్షకుడిని పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు…

ఆర్టిస్టు పర్ఫామెన్స్
ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా కొనసాగిన విష్ణు విశాల్, విక్రాంత్ లాంటి నటులు వాళ్ళ పర్ఫామెన్స్ తో కొంతవరకు సినిమాని బాగానే డీల్ చేశారు. అయినప్పటికీ రజినీకాంత్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. ఎప్పటిలాగే రజనీకాంత్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇక జైలర్ తర్వాత రజినీ ఈ సినిమా తో వచ్చినప్పటికి జైలర్ లో రజినీ చూపించిన స్వాగ్ ఈ సినిమాలో రిపీట్ అవ్వలేదు అనేది చాలా స్పష్టం గా తెలుస్తుంది. విష్ణు వి శాల్, విక్రాంత్ లు మాత్రం వాళ్ళ పరిధి దాటకుండా చాలా బాగా పర్ఫామెన్స్ చేశారు. అలాగే కేఎస్ రవికుమార్, జీవిత రాజశేఖర్ లు కూడా తమ పాత్రల మేరకు ఎక్కడ డివియెట్ అవ్వకుండా డీసెంట్ గా నటించారు… ఇక మిగిలిన నటీనటులు కూడా వాళ్ల పాత్రల పరధి మేరకు అయితే బాగా నటించారు…

టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ముందుగా ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ గానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గాని ఈ సినిమాకి ఏమాత్రం హెల్ప్ అవలేదు. ఇక దానికి తగ్గట్టుగా కొన్ని సీన్లలో ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఆ సీన్ మొత్తానికి మైనస్ అయిందనే చెప్పాలి. ఒకప్పుడు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే హీరోలు గాని, దర్శకులు గానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఆయన్ని సినిమాలో పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం రెహమాన్ మ్యూజిక్ అంతా ఇంపాక్ట్ చూపించట్లేదనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇక దానికి ఉదాహరణగా ఈ సినిమాను కూడా రెహమాన్ లిస్టులో చేరిపోయింది. ఇక ఈ సినిమాకి రైటర్ గా అలాగే సినిమాటోగ్రాఫర్ గా కొనసాగిన విష్ణు రంగస్వామి ఇచ్చిన విజువల్స్ సినిమాకి మంచి అవుట్ ఫుట్ అయితే అందించాయి. అలాగే షాట్స్ ను డిఫరెంట్ వేరియేషన్స్ లో చూపించడమే కాకుండా ప్రాపర్ షాట్స్ ను వాడి ఈ సినిమా విజువల్ గా బాగా రావడంలో తను చాలా వరకు హెల్ప్ చేశాడు. ఇక డైరెక్టర్ ఐశ్వర్య రజినీకాంత్ అయితే ఈ సినిమా మీద పెద్దగా ఫోకస్ చేసి తీసినట్టుగా అనిపించలేదు. ఎక్స్పీరియన్స్ లేని డైరెక్షన్ చాలా చోట్ల కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్

ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే
కథ
రజినీకాంత్

మైనస్ పాయింట్స్

ఈ సినిమాలో ఉన్న మైనస్ పైనుంచి ఏంటంటే
స్క్రీన్ ప్లే, డైరెక్షన్
మ్యూజిక్…

రేటింగ్
ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2/5