https://oktelugu.com/

Zomato : జొమాటోకు ఇన్ని కోట్ల లాభాలా? అసలేమైంది?

అసాధారణమైన పనితీరుతో పాటు ఫుడ్ డెలివరీలలో స్మార్ట్ నెస్ ప్రయోగించడం ఈ సంస్థకు కలిసి వచ్చింది.

Written By:
  • Srinivas
  • , Updated On : February 9, 2024 / 03:45 PM IST

    Zomato

    Follow us on

    Zomato : ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) మొత్తానికి నష్టాల నుంచి గట్టెక్కింది. గతేడాది మూడో త్రైమాసికంలో రూ.347 కోట్ల నష్టాన్ని చవి చూసిన ఈ సంస్థ ఈసారి మాత్రం రూ.138 కోట్ల నికర లాభం తెచ్చుకుంది. అసాధారణమైన పనితీరుతో పాటు ఫుడ్ డెలివరీలలో స్మార్ట్ నెస్ ప్రయోగించడం ఈ సంస్థకు కలిసి వచ్చింది. దీంతో గురువారం 2.42 లాభాల శాతంతో ముగియగా శుక్రవారం 4 శాతం పెరిగి లాభాలు పెరిగాయి. మొత్తంగా 52 వారాలా గరిష్ట స్థాయికి చేరుకుంది. ఒక దశలో జొమాటో పూర్తిగా కుప్పకూలుతుందనుకుంటున్న తరుణంలో గట్టెక్కడానికి పలు కారణాలు ఉన్నాయి.

    2023-24 డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను జొమాటో తాజాగా బయటపెట్టింది. తమ కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.1,948 కోట్లు పెరిగినట్లు సంస్థ సీఈవో దీపిందర్ తెలిపారు. మొత్ంగా 69 శాతం పెరిగి రూ.3,288 కోట్లకు చేరుకున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే డెలివరీ ఖర్చులు 63 శాతం పెరిగి రూ.1,068 కోట్లకు చేరినట్లు తెలిపారు. అలాగే మార్కెటింగ్ ఖర్చుల కోసం 7 శాతం వెచ్చించిటన్లు పేర్కొన్నారు.

    గతేడాది భారీ నష్టాన్ని చూసిన తరువాత కంపెనీ సంస్కరణలు చేపట్టింది. అవకాశం వచ్చిన ప్రతీ సమయాన్ని వినియోగించుకుంది. ఇందులో భాగంగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కంపెనీ పెద్ద ఎత్తున డెలివరీలు చేసింది. అలాగే వినియోగదారుల నుంచి ఎలాంటి కాంప్లెయింట్లు రాకుండా ఇన్ టైంలో సర్వ్ చేయడంలో సఫలీ కృత మైంది. దీంతో రోజురోజుకు జొమాటో కస్టమర్లు పెరిగారు.

    ఓ వైపు రెస్టారెంట్లు, వాటాదారుల ప్రయోజనాలను కాపాడుతూనే మరోవైపు వినియోగదారుల మనసును గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. రాబోయే త్రైమాసికంలో 50 శాతం వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు. జొమాటో షేర్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దీని షేర్ రూ.190 నుంచి రూ.205 కి పెంచింది. శుక్రవారం ప్రారంభ ట్రేడ్ లో 4 శాతానికి పైగా పెరిగింది. బీఎస్ ఈ లో 4.34 శాతం లాభపడి కొత్త గరిష్ట స్థాయికి రూ.150కి చేరింది.