Rajinikanth Jailer 2 Collections: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు వరుస బెట్టి సినిమాలు చేస్తున్న కూడా వాళ్లేవారికి భారీ విజయాలైతే దక్కడం లేదు. ఒకవేళ సక్సెస్ వచ్చినా కూడా అవి నార్మల్ విజయాలు గానే మారుతున్నాయి తప్ప ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలను మాత్రం వాళ్ళు చేయలేకపోతున్నారు. తెలుగు హీరోలు సక్సెస్ ఫుల్ గా రాణిస్తుంటే తమిళ్ హీరోలు మాత్రం డీలా పడిపోతున్నారు. వాళ్ళ నుంచి ఇప్పటివరకు ఒక్కటి కూడా 1000 కోట్ల సినిమా రాలేదు అంటే ఆ హీరోలు ఎంతలా డౌన్ ఫాల్ లో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ‘జైలర్’ సినిమాతో 400 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన రజినీకాంత్ ఇప్పుడు ‘జైలర్ 2’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అది తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కానీ రికార్డు ను రజనీకాంత్ క్రియేట్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఈ సినిమాతో రజనీకాంత్ 1000 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టబోతున్నాడట. మొత్తానికైతే ఈ ఫీట్ ని కనుక అతను అందుకుంటే తమిళ్ హీరోలందరికి నిజంగా షాక్ ఇచ్చిన వాడవుతాడు.
ఎందుకంటే రజనీకాంత్ 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా సినిమాలు చేస్తూ భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘జైలర్ 2’ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
1000 కోట్ల కలెక్షన్స్ ను సాధించి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తే మాత్రం రజినీకాంత్ ఇప్పటికీ సూపర్ స్టార్ గా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకున్న వాడవుతాడు. సినిమా అంటే ఇష్టం ఉన్నవాళ్లకి ఏజ్ తో సంబంధం లేదు. ఏ వయస్సు లో అయిన హీరోగా రాణించొచ్చు అనే ఒక మెసేజ్ ని సైతం ప్రేక్షకులకు అలాగే తన తోటి హీరోలకు ఇచ్చినవాడవుతాడు…నిజంగా ఇప్పటికీ రజినీకాంత్ తన సినిమాలతో ఆ స్వాగ్ ను మెయింటైన్ చేస్తుండటం విశేషం…