Rajinikanth: ఒకప్పుడు కమలహాసన్, రజనీకాంత్ సినిమాల మధ్య మంచి పోటీ ఉండేది.వీళ్లిద్దరి సినిమాలు వస్తున్నాయంటే చాలు జనాల్లో మంచి క్రేజ్ ఉండేది. వీళ్ళిద్దరూ తమ సినిమాలను సూపర్ డూపర్ సక్సెస్ లు చేస్తూ చాలా గొప్ప హీరోలుగా పేరు సంపాదించుకున్నారు అయినప్పటికీ వీళ్ళిద్దరికీ మధ్య వైవిధ్యమనదే ఎప్పుడు కనిపిస్తూ ఉండేది. ముఖ్యంగా కమలహాసన్ సాఫ్ట్ సినిమాలు చేస్తుంటే, రజనీకాంత్ మాత్రం మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గరయ్యాడు.
రజనీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అయినప్పటికీ రజనీకాంత్ తన స్టైల్ తో మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తూ ఎప్పటికప్పుడు వాళ్లకు నచ్చే సబ్జెక్టులను ఎంచుకుంటూ వాటిని సినిమాలుగా మలుస్తు తనలో ఉన్న టాలెంట్ ని జనాలకి చూపిస్తూ సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగాడు.ఇక ఈ క్రమంలో ఒకనొక సందర్భంలో కమలహాసన్ ని వెనక్కి నెట్టి రజినీకాంత్ సూపర్ స్టార్ ఇమేజ్ ని అందుకున్నాడు.
అయితే కమలహాసన్ సాఫ్ట్ సినిమాలు చేయడం వల్ల ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే అలరించగలిగాడు. కానీ రజనీకాంత్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించడంతో తను సూపర్ స్టార్ గా తమిళ్ ఇండస్ట్రీలో మంచి పొజిషన్ ని దక్కించుకున్నాడు…ఇక ఎప్పుడైనా మాస్ సినిమాలు చేసే హీరోలకి ఎక్కువ క్రెడిబిలిటీ ఉంటుంది. ఒకటి, రెండు సినిమాలు ప్లాప్ ఆయిన కూడా వాళ్ల మార్కెట్ అనేది పెద్దగా డౌన్ అవ్వదు. కానీ సాఫ్ట్ సినిమాలు చేసే హీరోలకి మార్కెట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఒకటి రెండు సినిమాలు ఫ్లాపులు పడితే మాత్రం వాళ్ల మార్కెట్ మరీ డౌన్ అయిపోతుంది. అందుకే ప్రతి హీరో కూడా మాస్ ఇమేజ్ ని సంపాదించుకోవడానికి చాలా పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు.
ఒక్కసారి మాస్ ఇమేజ్ వచ్చిందంటే ప్రేక్షకుల్లో ఆ హీరో తాలూకు ఇమేజ్ అనేది అలాగే ముద్రింప బడి ఉంటుంది…ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్న అందరి హీరోలకి మాస్ ఇమేజ్ అనేది ఉంది. అందుకే వాళ్ళు ఎక్కువ రోజుల పాటు ఇండస్ట్రీ లో హీరోలు గా కొనసాగ గలుగుతున్నారు… అందుకే ప్రతి హీరో కూడా మాస్ సినిమా చేయడానికి ఎక్కువగా ఉంటాడు కానీ వాటిని కూడా కొంత మంది హీరోలు మాత్రమే సక్సెస్ ఫుల్ గా డెలివరీ చేయగలుగుతారు.
అలా చేసిన వాళ్లు మాత్రమే ఇక్కడ భారీ ఎత్తున అవకాశాలు అనేవి అందుకుంటూ ఉంటారు. ఇక ఈ రకంగా అప్పట్లో కమలహాసన్ కి రజనీకాంత్ కి మధ్య మంచి పోటీ ఉండేది ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ రీ రిలీజ్ సమయంలో మళ్లీ పోటీ పడబోతున్నారు అనే వార్తలైతే వస్తున్నాయి.రజనీకాంత్ ముత్తు సినిమాని రీ రిలీజ్ చేయాలని చూస్తుండగా, కమల్ హాసన్ నటించిన అభయ్ సినిమాని కూడా రీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు…