Mega Family: 2023 వ సంవత్సరంలో చాలామంది హీరోలు వాళ్ల సినిమాలను రిలీజ్ చేశారు. ఇక ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి ఈ సంవత్సరం చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.అందులో సాయి ధరమ్ తేజ్ హీరో గా వచ్చిన విరూపాక్ష సినిమా ఒకటి ఈ సినిమా తో సాయి ధరమ్ తేజ్ ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.అయినప్పటికీ ఆ వెంటనే బ్రో అనే సినిమాతో ఒక ఫ్లాప్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు అయితే ఇందులో పవన్ కళ్యాణ్ కూడా భాగమయ్యాడు కాబట్టి అది ఇద్దరికి ప్లాప్ సినిమాగానే మిగిలిపోయింది.
ఇక వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున అనే సినిమాతో ఒక భారీ ప్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే వైష్ణవ్ తేజ్ కూడా ఆదికేశవ అనే సినిమాతో ఒక భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. ఇక ఈ ఇయర్ స్టార్టింగ్ లో చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన భోళా శంకర్ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక దీంతో మెగా హీరోలందరూ కూడా వరుసగా ఈ సంవత్సరం డిజాస్టర్ల బాట పట్టారు. అనేది వాస్తవం…
సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ తను కూడా బ్రో సినిమాతో మరో ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. చిరంజీవి పరిస్థితి కూడా అంతే ఇక 2023 వ సంవత్సరం మెగా ఫ్యామిలీకి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇక వచ్చే సంవత్సరంలో ఈ అందరు హీరోల నుంచి కూడా దాదాపు ఒకటి నుంచి రెండు సినిమాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక వాటితో హీరోలందరూ మంచి సక్సెస్ సాధించాలని చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీకి ఇన్ని ప్లాప్ లు ఏ ఇయర్ లో రాలేదు. ఇక ఈ ఇయర్ అనేది మెగా ఫ్యామిలీకి ఒక పీడ కలగా మిగిలిందనే చెప్పాలి.
చాలామంది హీరోలు మంచి సినిమాలతో సక్సెస్ లు కొడితే మెగా ఫ్యామిలీ మాత్రం ఈ సంవత్సరం చతికలబడిపోయింది. ఇక ఇది తెలుసుకున్న మెగా ఫ్యామిలీ అభిమానులు మాత్రం కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ రావడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. దాని వల్ల మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక నెక్స్ట్ సంవత్సరం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధిస్తాయి అంటూ వాళ్లు చెప్తున్నారు…