Sandeep Reddy Vanga: ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లు గా గుర్తింపు పొందుతున్న యంగ్ డైరెక్టర్లు అందరూ కూడా చిరంజీవితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లు అందరు చిరంజీవి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చి సినిమాలను డైరెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆయనని ఒక్కసారైనా డైరెక్షన్ చేయాలనే కోరిక ప్రతి ఒక్కరు ఉంటుంది. అందుకే ఆయనతో సినిమా చేయడానికి ప్రతి ఒక్కరు డైరెక్టర్ కూడా ఉత్సాహన్ని చూపిస్తున్నాడు.
ఇక ఇదే విషయం పైన లేటెస్ట్ గా అనిమల్ సినిమా చేసి ఒక మంచి విజయాన్ని అందుకున్న సందీప్ రెడ్డి వంగ ని అడగగా ఆయన కూడా చిరంజీవి అవకాశం ఇస్తే చిరంజీవి గారితో ఒక సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ సమాధానం ఇచ్చాడు. ముఖ్యంగా సందీప్ మాట్లాడుతూ నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాను, ఆయనంటే నాకు విపరీతమైన ఇష్టం ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం.
వీళ్లిద్దరి సినిమాలు ఎక్కువగా చూసేవాడిని అంటూ చెప్పాడు. చిరంజీవి గారితో సినిమా చేసే అవకాశం వస్తే నా స్టైల్ లో ఒక మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా చేస్తాను అంటూ చెప్పాడు. ఇక చిరంజీవి గారు నుంచి అవకాశం రావడమే ఆలస్యం పక్క స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాను అంటూ సందీప్ చిరంజీవితో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాను అంటు చిరంజీవి కి ఒక హింట్ అయితే ఇచ్చాడు.ఇక ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే చిరంజీవి పేరు మరోసారి ఇండస్ట్రీలో మారు మ్రోగడం పక్క ఇది సోషల్ ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమా మీద ప్రతి ప్రేక్షకుడికి విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మీద చిరంజీవి కూడా నమ్మకాన్ని పెట్టుకున్నాడు.
ఇక ఇంతకు ముందు డైరెక్టర్ వశిష్ఠ చేసిన బింభిసార సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో అలాంటి సినిమానే మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కనక సక్సెస్ అయితే వశిష్ఠ టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోతాడు… ప్రస్తుతం డైరెక్టర్లు అందరూ వీబిన్నమైన సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. ఇక చిరంజీవి కూడా సందీప్ రెడ్డి వంగ కి తనతో సినిమా చేసే అవకాశం ఎప్పుడు ఇస్తాడో చూడాలి…