Rajinikanth: సూపర్ స్టార్ అనే ఇమేజ్ కే గౌరవం తెచ్చిన వ్యక్తి రజినీకాంత్. తన సినిమాల్లోని మాటలతో ఎన్నో తూటాలు పేల్చాడు ఆయన. ముఖ్యంగా డైలాగ్స్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పొందిన సూపర్ స్టార్ రజినీకాంత్. రజనీ చేసిన ప్రతి సినిమాల్లోనూ డైలాగులు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. అద్భుతంగా అనిపిస్తాయి.

మరి ముఖ్యంగా ఆ డైలాగ్స్ కొన్ని మనసుకు హత్తుకుపోతాయి. మరికొన్ని పవర్‌ఫుల్ పంచ్ లుగా మిగిలిపోతాయి. మొత్తానికి సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు రజని. ఐతే, తాను అసలు10 శాతం కూడా సంతోషంగా లేనని రజినీకాంత్ చెప్పిన మాటలు.. ప్రస్తుతం ఆయన అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులను కూడా తీవ్రంగా కలిచివేస్తోంది.
Also Read: The Warrior Movie Collections: ‘ది వారియర్’ 12 డేస్ కలెక్షన్స్.. ఎంతొచ్చింది ? ఇంకెంత రావాలి ?
తాజాగా ‘యోగతా సత్సంగ్ సోసైటీ ఆఫ్ ఇండియా’ సంస్థ ‘హ్యాపీ సక్సెస్‌ఫుల్ లైఫ్ త్రూ క్రియా యోగా’ అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చెన్నైలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. ‘ఓం గురువే చరణం’ అంటూ స్పీచ్‌ను స్టార్ట్ చేశారు.
ఇంతకీ రజని ఏమి మాట్లాడారో.. ఆయన మాటల్లోనే విందాం. ‘నా సినీ కెరీర్ లో రాఘవేంద్ర’, ‘బాబా’ వంటి చిత్రాలు నాకు చాలా ఆత్మ సంతృప్తినిచ్చాయి. మీకు తెలుసు. ‘నేను ‘బాబా’లో నటించిన తర్వాత చాలా మంది హిమాలయాలకు వెళ్లారు. కొంత మంది నా అభిమానులు సన్యాసం కూడా స్వీకరించారు. ఆ పర్వత ప్రాంతాల్లో ఎన్నో మూలికాలు లభిస్తాయి.

ఒకసారి మనం వాటిని తింటే.. వారానికి కావాల్సిన విటమిన్స్ అన్నీ మనకు అందుతాయి. ఆస్తిపాస్తులతో కాకుండా అనారోగ్యం లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టడం చాలా ముఖ్యం. అదే ఒక్కసారి అనారోగ్యం బారిన పడ్డాక, ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అప్పుడు మనకు అన్నీ ఉన్నా.. ఎన్నో అవరోధాలు వస్తాయి. అందుకే.. ఒక్క వ్యక్తికి శారీరక ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని నేను నమ్ముతాను.
నేను ఈ మధ్య రెండు సార్లు ఆస్పత్రి పాలైన సంగతి మీకు తెలుసు. నా జీవితంలో నాకు డబ్బు ఉంది. ఫేమ్ ఉంది. కానీ, ఆరోగ్యం లేదు. నేను 10 శాతం కూడా సంతోషం, ప్రశాంతతో లేను’’ అంటూ రజినీకాంత్ ఎమోషనల్ గా చెప్పారు. ప్రస్తుతం రజనీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read:Thank You Movie Collections: ‘థాంక్యూ’ 3 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎన్ని కోట్లు రావాలంటే ?
[…] […]
[…] […]