SSMB 29 Update: గత రెండేళ్ల నుండి మహేష్ బాబు(Super Star Mahesh Babu) పుట్టిన రోజు కి ఎలాంటి కొత్త సినిమా అప్డేట్ రావడం లేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం చేస్తున్నది రాజమౌళి(SS Rajamouli) తో కాబట్టి. ఈ సినిమా మొదలైనట్టు కూడా రాజమౌళి నుండి ఇప్పటి వరకు అప్డేట్ రాలేదంటే అభిమానులకు కోపం రావడం లో తప్పు లేదు కదా. కానీ ప్రపంచ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని దున్నేసే సినిమా తీస్తున్నాడు కాబట్టి, అభిమానులు ఓపికని కూడగట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి మూవీ అప్డేట్ రావడం లేదట. దీనిపై ఇప్పటికే మూవీ టీం క్లారిటీ తో ఉన్నట్టు తెలుస్తుంది. చూస్తుంటే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యే వరకు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఇవ్వకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న రూమర్. ఇంత గోప్యంగా ఈ సినిమాకు సంబంధించిన వివరాలను మైంటైన్ చేస్తున్నారంటే కచ్చితంగా రాజమౌళి కనీవినీ ఎరుగనిది ఎదో ప్లాన్ చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు.
Also Read: కూలీ ట్రైలర్ రివ్యూ: కాస్టింగ్, యాక్షన్ ఎక్కువ.. మ్యాటర్ తక్కువైందే!
ఇదంతా పక్కన పెడితే ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అనధికారిక అప్డేట్ ఇప్పుడు వాళ్లకు గూస్ బంప్స్ వచ్చేలా చేస్తుంది. సెప్టెంబర్ 2వ వారం లో ఒక భారీ షెడ్యూల్ ని సౌత్ ఆఫ్రికా లోని తాంజానియా ప్రాంతం లో షూటింగ్ చేయబోతున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు కేవలం కొన్ని హాలీవుడ్ చిత్రాలకు మాత్రమే షూటింగ్ చేసుకోవడానికి అనుమతిని ఇచ్చారు. కానీ మొట్టమొదటిసారి ఒక ఇండియన్ మూవీ షూటింగ్ కూడా ఇక్కడ జరగబోతుంది. ఆ ఘనత మహేష్, రాజమౌళి సినిమాకు దక్కడం విశేషం. ఈ షెడ్యూల్ లో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ కూడా పాల్గొంటారట. వీళ్లిద్దరు ఈ సినిమాలో విలన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ మరియు ఇతర తారాగణం గురించి తెలియాల్సి ఉంది.
సౌత్ ఆఫ్రికా కి బదులుగా కెన్యా లోని సెరెంగంటి నేషనల్ పార్క్ లో ఈ షెడ్యూల్ ని చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ కెన్యా లో ప్రత్యేక పరిస్థితుల కారణంగా అక్కడి నుండి సౌత్ ఆఫ్రికా కి షిఫ్ట్ చెయ్యాల్సి వచ్చింది. ఈ షెడ్యూల్ లో డైనోసార్స్ తో హీరో పోరాటం చేసే సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారట. పురాణాల్లో మృత సంజీవని కోసం ఆంజనేయ స్వామి పర్వతాన్ని ఎత్తుకొచ్చే ఘటన గురించి మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, ఎన్నోసార్లు టీవీలలో, సినిమాల్లో చూసాము. ఇప్పుడు అదే సంజీవని కోసం మహేష్ బాబు చేసే ప్రయాణమే ఈ సినిమా అట. ఈ క్రమం లో ఆయనకు ఎదురయ్యే సవాళ్లు రోమాలు నిక్కపొడుచుకొని రేంజ్ అడ్వెంచర్స్ తో ఉంటాయని సమాచారం. ఇకపోతే ఈ చిత్రం లో మహేష్ బాబు తండ్రి గా తమిళ హీరో మాధవన్ నటిస్తున్నాడట.