Rajinikanth Coolie Movie Updates: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు రజినీకాంత్ (Rajinikanth)… ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా చాలా అలవోకగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆయన కెరియర్ మొదట్లో సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు కుర్ర హీరోలతో పోటీపడుతూ సాధిస్తున్న విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటులలో తను కూడా ఒకరు కావడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ భారీ రేంజ్ లో సినిమాని చేసి ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. లోకేష్ కనకరాజు లాంటి దర్శకుడితో కలిసి ఆయన చేస్తున్న కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాతో ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్లకు పోటీగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి చేసిన వార్ 2(War 2) సినిమా కూడా వస్తుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.
Also Read: రామాయణ గ్లింప్స్ ఎలా ఉందంటే
అందులో భాగంగానే కూలీ (Coolie) సినిమా కోసం లోకేష్ కనకరాజు ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. అదేంటి అంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని ఎక్కువ సంఖ్యలో చేసి ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఎక్కువ బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు…
దానివల్ల ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని పాజిటివ్ టాక్ వస్తే అల్టిమేట్ గా భారీ విజయాన్ని సాధిస్తుందనే ఆలోచనలో లోకేష్ కనకరాజు ఉన్నారట… ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ ఎక్కువగా చేసిన సినిమాలకు మాత్రమే సక్సెసులైతే దక్కుతున్నాయి. అలాగే భారీ ఓపెనింగ్స్ కూడా వస్తున్నాయి.
Also Read: రామ్ చరణ్-దిల్ రాజు వివాదానికి అసలు కారణం అతడే, షాకింగ్ ఫ్యాక్ట్స్!
ప్రస్తుతం ఉన్న రోజుల్లో సినిమాని చేయడం ఎంత ముఖ్యమో దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఒక సినిమా సక్సెస్ లో ప్రమోషన్స్ కూడా కీలక పాత్ర వహిస్తున్నాయనే చెప్పాలి… మరి రజినీకాంత్, ఎన్టీఆర్ మధ్య జరగబోయే ఈ వార్ లో ఎవరు గెలుస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరొక నెల రోజుల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది…