Vijay Deverakonda and Nani: రజినీకాంత్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను మూటగట్టుకుంది. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ మొదటి పార్ట్ భారీ విజయాన్ని సాధించడంతో రెండో పార్ట్ మీద అంచనాలు తారా స్థాయికి వెళ్లిపోయాయి. ఇక ఈ సినిమా అనుకున్న టైమ్ కి ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని గతంలో దర్శకనిర్మాతలైతే క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కాస్త బ్యాలెన్స్ ఉందని అది పూర్తయిన తర్వాత రెండు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చేయాల్సి ఉంటుందనే ఉద్దేశ్యంతోనే వాళ్లయితే వాళ్ల సమాధానాన్ని చెబుతున్నారు.
ఇక ఈ మధ్యకాలంలోనే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు కొద్దికొద్దిగా తగ్గిపోతున్నాయి. కారణం ఏంటి అంటే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేయలేదు. దాంతో అసలు ఈ సినిమా ఉందా లేదా అనే సందిగ్ధ పరిస్థితిలో కూడా ప్రేక్షకులైతే ఉన్నారు. ఇక వీలైనంత తొందరగా ఈ సినిమా మీద ప్రమోషన్స్ చేయ అవసరమైతే ఉంది.
ఇక ఆగస్టు నెలలో ఇప్పటికే ‘ప్యారడైజ్’ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ‘జైలర్ 2’ సినిమా కూడా అదే నెలలో వస్తుందా లేదంటే పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ నెలలో రిలీజ్ కి రెడీ అవ్వబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక సెప్టెంబర్ లో విజయ్ దేవరకొండ చేస్తున్న ‘రణబాలి’ అనే సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య తీవ్రమైన పోటీ ఉండబోతుంది… ఇక వీటిలో ఏ సినిమా పై చేయి సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…
