Homeఎంటర్టైన్మెంట్Ram Charan emotional comments: నేను చనిపోయేవరకు ఆ పని చేస్తూనే ఉంటా అంటూ రామ్...

Ram Charan emotional comments: నేను చనిపోయేవరకు ఆ పని చేస్తూనే ఉంటా అంటూ రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్..

Ram Charan emotional comments: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటంచిన ‘పెద్ది’ చిత్రం ఎట్టకేలకు మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ ఇండియా లో కూడా ప్రస్తుతం ‘పెద్ది’ మేనియా నే కనిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ని రామ్ చరణ్ ఫ్యాన్స్ కబ్జా చేసేసారు. ఈ సందర్భంగా ఈ సినిమా హైప్ కి మరింత బూస్టింగ్ ఇస్తూ , నిన్న విజయవాడ […]

Ram Charan emotional comments: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటంచిన ‘పెద్ది’ చిత్రం ఎట్టకేలకు మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ ఇండియా లో కూడా ప్రస్తుతం ‘పెద్ది’ మేనియా నే కనిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ని రామ్ చరణ్ ఫ్యాన్స్ కబ్జా చేసేసారు. ఈ సందర్భంగా ఈ సినిమా హైప్ కి మరింత బూస్టింగ్ ఇస్తూ , నిన్న విజయవాడ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి అభిమానులు వేలాదిగా తరళి వచ్చి విజయవంతం చేశారు. ఒక్క మాట లో చెప్పాలంటే విజయవాడ ని షేక్ చేసి వదిలిపెట్టారు. ఈ ఈవెంట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లోనే ది బెస్ట్ స్పీచ్ ఇవ్వగా, అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘చాలా మంది పెద్ది సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను అని అంటున్నారు. ఇలాంటి కథలు వచ్చినప్పుడు కష్టపడకపోతే , ఇంకెప్పుడు కష్టపడుతాం చెప్పండి. బుచ్చి బాబు ఈ సినిమా స్టోరీ మొత్తాన్ని నాకు వినిపించినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే ఇలాంటి కథతో ఇప్పుడు వరకు సినిమాలే రాలేదు. నా కెరీర్ లోనే ఇది ది బెస్ట్ సినిమా అవుతుంది. మీ అందరికీ మరో ముఖ్యమైన విషయం చెప్తున్నాను , రాసి పెట్టుకోండి, ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చి బాబు టాప్ 3 ఇండియన్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచిపోతారు , ఆ స్థాయి కెపాసిటీ ని నేను అతనిలో గమనించాను’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే నార్త్ ఇండియా లోని భోపాల్ ఈవెంట్ లో రామ్ చరణ్ స్పీచ్ పై ఏ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయో మనమంతా చూశాము .

క్రికెటర్ బుమ్రా ని పట్టుకొని ఫుట్ బాల్ ప్లేయర్ అనడం పెద్ద సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. అయితే ఈ ఈవెంట్ మీద వచ్చిన ట్రోల్స్ ని రామ్ చరణ్ బాగా గమనించినట్టు ఉన్నాడు. అందుకే ‘ఈసారి నేను ఎవరి పేరు మర్చిపోలేదు కదా’ అంటూ ఫన్నీ సెటైర్లు విసిరాడు. అంతే కాకుండా ఆయన చివర్లో మాట్లాడిన మాటలు అభిమానులను చాలా ఎమోషనల్ కి గురి చేసింది. ఆయన మాట్లాడుతూ ‘నాన్న గారు , బాబాయ్ కళ్యాణ్ గారు ఈ ఇండస్ట్రీ లో ఉన్నందుకు నేను సినిమా కోసమే బ్రతుకుతాను. నాకు సినిమా తప్ప మరొకటి తెలీదు. సినిమా , సినిమా , మిమ్మల్ని నేను చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను ‘ అంటూ రామ్ చరణ్ మాట్లాడిన ఈ మాటలు అభిమానుల చేత కంటతడి పెట్టించేలా చేశాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper