South Heros: సౌత్ మూవీస్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. నెలల వ్యవధిలో తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలు వందల కోట్ల వసూళ్లు రాబట్టాయి. పుష్ప మూవీతో మొదలైన వసూళ్ల జోరును విక్రమ్ కొనసాగిస్తోంది. కాగా సౌత్ ఇండియాకు చెందిన 8 మంది హీరోలు రూ. 300 కోట్ల మార్క్ క్రాస్ చేశారు. కాగా ఈ లిస్ట్ లో ఉన్న సౌత్ స్టార్స్ ఎవరో చూద్దాం… సౌత్ ఇండియా నుండి ఈ బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన హీరో రజినీకాంత్. ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా ఉన్న రజినీకాంత్ రోబో మూవీతో ఈ ఫీట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆయన నటించిన మరో రెండు చిత్రాలు మూడు వందల క్లబ్ లో చేరాయి. కబాలి, 2.0 చిత్రాలు మూడు వందలకు పైగా వసూళ్లు సాధించాయి.

రజినీకాంత్ తర్వాత ఈ క్లబ్ లో చేరిన హీరో ప్రభాస్. ఆయన కూడా ఏకంగా మూడు చిత్రాలతో రజినీకి పోటీ ఇస్తున్నారు. మూడు వందల కోట్ల వసూళ్లు దాటిన ప్రభాస్ మొదటి సినిమా బాహుబలి. అలాగే బాహుబలి 2, సాహో చిత్రాలు ఈ మార్క్ దాటాయి. కోలీవుడ్ స్టార్ విజయ్ బిగిల్ మూవీతో మూడు వందల కోట్ల మార్క్ చేరుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తో కూడా భారీ వసూళ్లు రాబట్టింది.

ఇక పుష్ప మూవీతో అల్లు అర్జున్ ఈ లిస్ట్ లో చేరారు. పుష్ప వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కలిపి మూడు వందలకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్ మూడు వందల కోట్ల మార్క్ చేరుకున్నారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ రూ. 1100 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రాబట్టింది. ఆర్ ఆర్ ఆర్ యూఎస్ లో రీరిలీజ్ చేయగా అమెరికన్స్ కూడా ఎగబడి చూసేస్తున్నారు.

మరో ఇద్దరు సౌత్ ఇండియన్ హీరోలు ఈ మార్క్ చేరుకున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 2 ప్రభంజనం సృష్టించింది. విడుదలైన అన్ని భాషల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న కెజిఎఫ్ 2 రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కెజిఎఫ్ 2 మూవీతో యష్ మూడు వందల కోట్ల క్లబ్ లో చేరారు. ఇక విక్రమ్ మూవీతో కమల్ హాసన్ లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన విక్రమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. 2022 తమిళ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన విక్రమ్ తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా దుమ్ముదులుపుతుంది. తాజాగా విక్రమ్ రూ. 300 కోట్ల మార్క్ దాటేసింది. రజినీకాంత్, ప్రభాస్, విజయ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, యష్, కమల్ హాసన్ వరుసగా సౌత్ ఇండియా నుండి రూ. 300 కోట్ల క్లబ్ లో చేరారు.
[…] […]