మూవీ రివ్యూః క్లైమాక్స్‌

న‌టీన‌టులుః రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సాషా సింగ్‌, శ్రీరెడ్డి, పృథ్వీ, శివ శంక‌ర్ మాస్ట‌ర్‌, ర‌మేష్ త‌దిత‌రులు ద‌ర్శ‌క‌త్వంః భ‌వాని శంక‌ర్ కే నిర్మాత‌లుః రాజేశ్వ‌ర్ రెడ్డి, క‌రుణాక‌ర్ రెడ్డి మ్యూజిక్ః రాజేష్ నిద్వాన‌ సినిమాటోగ్ర‌ఫీః ర‌వికుమార్ నీర్ల‌ రిలీజ్ డేట్ః మార్చి 5, 2021 క‌థః ఇది విజ‌య్ మోడీ అనే ఓ వ్య‌క్తి క‌థ‌. విజ‌య్ మోడీ(రాజేంద్ర ప్ర‌సాద్‌) ఓ అవ‌కాశ వాది. తాను ఎద‌గ‌డానికి ఎలాంటి అడ్డ‌దారులైనా నిస్సందేహంగా తొక్కేస్తుంటాడు. ఈ క్ర‌మంలో ఓ మంత్రికి […]

Written By: Rocky, Updated On : March 5, 2021 12:08 pm
Follow us on


న‌టీన‌టులుః
రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సాషా సింగ్‌, శ్రీరెడ్డి, పృథ్వీ, శివ శంక‌ర్ మాస్ట‌ర్‌, ర‌మేష్ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వంః భ‌వాని శంక‌ర్ కే
నిర్మాత‌లుః రాజేశ్వ‌ర్ రెడ్డి, క‌రుణాక‌ర్ రెడ్డి
మ్యూజిక్ః రాజేష్ నిద్వాన‌
సినిమాటోగ్ర‌ఫీః ర‌వికుమార్ నీర్ల‌
రిలీజ్ డేట్ః మార్చి 5, 2021

క‌థః ఇది విజ‌య్ మోడీ అనే ఓ వ్య‌క్తి క‌థ‌. విజ‌య్ మోడీ(రాజేంద్ర ప్ర‌సాద్‌) ఓ అవ‌కాశ వాది. తాను ఎద‌గ‌డానికి ఎలాంటి అడ్డ‌దారులైనా నిస్సందేహంగా తొక్కేస్తుంటాడు. ఈ క్ర‌మంలో ఓ మంత్రికి బినామీగా ఉంటాడు. బ్యాంకుల నుంచి రుణం తీసుకొని బ‌డా పారిశ్రామిక వేత్త‌గా మారిపోతాడు. అయితే.. చివ‌ర‌కు అప్పుల‌పాలై, హ‌త్య‌కు గుర‌వుతాడు. విజ‌య్ మోడీ ఎందుకు అప్పుల పాల‌య్యాడు? ఎవ‌రు చంపారు? ఎందుకు చంపారు? తాను బినామీగా ఉన్న మంత్రి ఏం చేశాడు? అన్న‌ది మిగ‌తా క‌థ‌.

Also Read: మూవీ రివ్యూః ‘ఏ1 ఎక్స్ ప్రెస్’

క‌థ‌నంః ఈ క్లైమాక్స్‌ సినిమా నిడివి మొత్తం గంట‌న్న‌ర మాత్ర‌మే. బ‌హుశా ఓ వ్య‌క్తిని సెంట్ర‌లైజ్ చేసుకుని న‌డిచే స్టోరీ లెంగ్తీగా ఉంటే బోర్ కొడుతుంద‌ని భావించి ఉండొచ్చు. అయితే.. థ్రిల్ల‌ర్ జాన‌ర్ కు ఎప్పుడూ ఓ బెనిఫిట్ ఉంటుంది. ట్విస్టులు ప్రేక్ష‌కుల ఊహ‌కు అంద‌కుండా చూసుకుంటే చాలు.. ద‌ర్శ‌కుడు పాసైపోవచ్చు. ఇదే సబ్జెక్టును ఎంచుకున్న భ‌వాని శంక‌ర్ మంచి ప‌నిత‌నాన్నిచాటుకున్నాడు. ముఖ్యంగ్రా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వ‌ర‌కు బిగి స‌డ‌ల‌కుండా క‌థ‌నున న‌డిపించాడు. అయితే.. క‌థ‌, క‌థ‌నాల‌పై మ‌రికొంత దృష్టిపెడితే ఇంకా.. బెస్ట్ ఔట్ పుట్ వ‌చ్చేద‌ని అనిపిస్తుంది. సినిమా మొత్తం గంట‌న్న‌రే ఉన్న‌ప్ప‌టికీ.. ఇందులోనూ ఫ‌స్టాఫ్ బోర్ కొట్టిస్తుంది. సాధార‌ణ స‌న్నివేశాలు ఇబ్బంది పెడ‌తాయి. విజ‌య్ మోడీని ఎస్టాబ్లిష్ చేయ‌డానికే ఎక్కువ స‌మ‌యం తీసుకున్న‌డు ద‌ర్శ‌కుడు. అయితే.. సెకండ్ హాఫ్ లోనే అస‌లు క‌థ మొద‌లవుతుంది.

పెర్ఫార్మెన్స్ః ఇలాంటి పాత్ర‌లు రాజేంద్ర‌ప్ర‌సాద్ కు వెరీ ఈజీ. విజ‌య్ మోడీ పాత్ర‌లో ఆయ‌న జీవించేశారు. ఇక‌, త‌న లుక్స్ పూర్తిగా డిఫ‌రెంట్ గా ఉండ‌డంతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ నే పోషించి ఫ‌ర్వాలేద‌నిపించింది. అయితే.. పాత్ర లెంగ్త్ త‌క్కువ‌గా ఉండ‌డంతో త‌న‌ను నిరూపించుకునేందుకు పెద్ద‌గా స్కోప్ రాలేదు. ఇక‌, సాషా సింగ్‌, పృథ్వీ, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ ఫ‌ర్వాలేద‌నిపించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాజేశ్ నిద్వాన నేప‌థ్య సంగీతం బాగుంది. ర‌వి కుమార్ నీర్ల ఛాయా గ్ర‌హ‌ణం సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి. ఓవ‌రాల్ గా థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో వ‌చ్చిన ‘క్లైమాక్స్’ మూవీ ఫర్వాలేదనిపిస్తుంది. సస్పెన్స్ ను ఇష్టపడే ఆడియన్స్ ను ఈ సినిమా పూర్తిస్థాయిలో అలరిస్తుంది. సాధారణ ప్రేక్షకులు ఓసారి చూసి ఆనందించొచ్చు. అయితే.. ఈ వీకెండ్ లో ఎలాంటి పెర్ఫార్మెన్స్ చూపిస్తుందన్న దానిపైనే సినిమా నిలబడే అవకాశం ఉంది.

Also Read: బ్ర‌హ్మానందంపై సుడిగాలి కామెంట్స్‌..

ప్లస్ పాయింట్స్ః రాజేంద్ర ప్ర‌సాద్ న‌ట‌న‌, క్లైమాక్స్‌, స‌స్పెన్స్ సీన్లు

మైన‌స్ పాయింట్స్ః ఫ‌స్ట్ హాఫ్‌, సాధార‌ణ కామెడీ

లాస్ట్ లైన్ః ‘క్లైమాక్స్’ ఫ‌ర్వాలేదు

రేటింగ్ 2.5

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్