Rajeev Kanakala
Rajeev Kanakala : ఇండస్ట్రీ లో నవరసాలు పలికించగల అతి తక్కువమంది క్యారక్టర్ ఆర్టిస్టులతో ఒకరు రాజీవ్ కనకాల(Rajeev Kanakala). సీనియర్ నటుడు దేవదాస్ కనకాల కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రాజీవ్ కనకాల, కెరీర్ ప్రారంభం లోనే మంచి క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సంపాదించుకున్నాడు. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ ఆర్టిస్టుగా గడుపుతున్న రాజీవ్ కనకాల గురించి అతని స్నేహితుడు హర్ష వర్ధన్ చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. హర్ష వర్ధన్(Harsha Vardhan) అంటే ఎవరో కాదు, మనం చిన్నతనం లో ఎగబడి చూసిన అమృతం సీరియల్ హీరో. ఇప్పటికీ ఆయన రచయితా గా, డైరెక్టర్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా బిజీ లైఫ్ ని లీడ్ చేస్తూనే ఉన్నాడు. హర్ష వర్ధన్ రాజీవ్ కనకాల కి ప్రాణ మిత్రుడు. వీళ్లిద్దరి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఇటీవలే హర్ష వర్ధన్ ఒక పోడ్ క్యాస్ట్ లో చెప్పుకొచ్చాడు.
Also Read : రాజీవ్ కనకాల ఎన్టీయార్ కి చేసిన ప్రామిస్ ఏంటో తెలుసా..?
ముందుగా యాంకర్ హర్ష వర్ధన్ ని ఒక ప్రశ్న అడుగుతూ, ‘మీరు,రాజీవ్ కనకాల నిద్రాహారాలు మానేసి ఒకే చోట రెండు రోజుల పాటు ఉన్నారట కదా, దాని కథ ఏమిటి?, వివరంగా చెప్తారా?’ అని అడగగా, దానికి హర్ష వర్ధన్ సమాధానం చెప్తూ ‘ ఈ విషయం రాజీవ్ కి తప్ప ఎవరికీ తెలియదు. నీ దాకా వచ్చిందంటే, ఇంతకు ముందు నన్ను ఇరికించాలనే చెప్పి ఉంటాడు. ఇప్పుడు నేను వాడిని ఇరికిస్తాను. ఒక సందర్భం లో నేను, రాజీవ్ కనకాల చాలా ఖాళీ అయిపోయాం. చేతిలో పని లేక, ఏమి చేయాలో అర్థం కానీ రోజులవి. దీంతో ఓసారి మేమిద్దరం పేకాట ఆడడం మొదలు పెట్టాం. రాత్రి 8 గంటలకు మొదలు పెడితే, తెల్లవారుజామున మూడు గంటలకు లేచాం. పక్కరోజు కాదు,ఆ మరుసటి రోజున లేచాం. అంటే మూడవ రోజు అన్నమాట’.
‘మేము పేకాట మొదలు పెట్టినప్పుడు కాసేపు మాతో కూర్చొని ముచ్చట్లు ఆడి వెళ్లిపోయిన మా స్నేహితులు, మూడవ రోజు వచ్చి మమ్మల్ని చూసి షాక్ కి గురయ్యారు. వారిలో సినీ నటుడు సమీర్ కూడా ఉన్నాడు. మూడు రోజుల నుండి ఇలాగే కూర్చొని పేకాట ఆడుతున్నారా?, ఆకలి వేయలేదా?, నిద్రపట్టలేదా?, కనీసం బాత్రూం కి అయినా వెళ్ళారా లేదా అని అడిగారు. వాళ్ళు మా పక్కన చేరి ఎన్ని ప్రశ్నలు అడిగినా మేము సమాధానం ఇవ్వలేదు. కనీసం ఊ కూడా కొట్టలేదు. అంతలా పేకాటలో లీనం అయిపోయాము. ఈ పేకాట లో నేను బాగా లాస్ అయిపోయాను. రాజీవ్ కి 350 కోట్లు బాకీ పడ్డాను, 5 పైసలతో మొదలు పెట్టిన ఆట పెరుగుకుంటూ పోయి 350 కోట్లకు చేరింది. అంటే ఎన్నిసార్లు ఆడామో ఆ మూడు రోజులు మీరే అర్థం చేసుకోండి’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.
Also Read : రాజీవ్ కనకాల ఎన్టీయార్ కి చేసిన ప్రామిస్ ఏంటో తెలుసా..?