Pooja Hegde
Pooja Hegde : సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే స్టార్ హీరోయిన్స్ లో ఒకరు పూజా హెగ్డే(Pooja Hegde). ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ని ఈమె వాడినంతగా ఏ తెలుగు హీరోయిన్ కూడా వాడదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటో షూట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ, కుర్ర కారుల్లో హీట్ ని పుట్టిస్తూ ఉంటుంది. సరికొత్త డిజైనర్ బట్టల్లో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తూ, రకరకాల భంగిమలతో తన అభిమానులను మెంటలెక్కిపోయేలా చేస్తూ ఉంటుంది పూజా హెగ్డే. తన సినిమాలలో కూడా ఆమె ఈ రేంజ్ అందాల ఆరబోత చేయదు, కేవలం ఇన్ స్టాగ్రామ్ లోనే ఇలాంటి షో చేస్తూ ఉంటుంది. ఆందుకే ఆమెకు 27 మిలియన్ల ఫాలోవర్లు ఉంటారు. కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆమెని అనుసరిస్తూ ఉంటారు.
Also Read : హీరోలతో నాకు ఎదురైనా ఇబ్బందులు ఇవే : పూజ హెగ్డే
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆమె సమ్మర్ స్పెషల్ దుస్తులలో కనిపించి అందరినీ షాక్ కి గురి చేసింది. ఈసారి ఆమె ఫ్లోరల్ బొటానిక్ ప్రింటెడ్ గౌనులో కనిపించింది. 1930 వ సంవత్సరం నుండి బెంజ్ ఫ్యాషన్ వాదుల్లో బాగా ట్రెండ్ అవుతూ వచ్చిన లుక్ ఇది. ఈ పొట్టి గౌనులో పూజా హెగ్డే వివిధ రకాల భంగిమలతో ఫోటోలు దిగి ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. ఈ ఫొటోలో ఆమె ధరించిన హ్యాండ్ బ్యాగ్ చూసేందుకు చాలా సాధారణంగా కనిపిస్తుంది కదూ. కానీ ఆ బ్యాగ్ ని సామాన్యులు కొనలేరు. ఎందుకంటే దాని విలువ అక్షరాలా 3,19,000 రూపాయిలు. ఒక మధ్య తరగతి కుటుంబం ఈ డబ్బులతో ఎలాంటి చీకు చింత లేకుండా మూడు నెలల పాటు బ్రతికేయొచ్చు, అంత డబ్బు ఇది. కొంత మంది సెకండ్ హ్యాండ్ లో కార్లు కూడా కొనేయొచ్చు.
ఇకపోతే పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె టాలీవుడ్ కి ఆమడదూరం లో ఉంది. తమిళం లో ఆమె హీరో సూర్య(Suriya Sivakumar) తో కలిసి చేసిన ‘రెట్రో'(Retro Movie) చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు తలపతి విజయ్(Thalapathy Vijay) తో కలిసి భగవంత్ కేసరి చిత్రం తమిళ రీమేక్ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు చిత్రాలతో పాటు రాఘవ లారెన్స్ దర్శకత్వం లో ‘కాంచన 4’ లో నటించడానికి సిద్ధంగా ఉంది. మరోపక్క ఆమె బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో కలిసి ఒక సినిమా చేస్తుంది. రీసెంట్ గానే ఆమె షాహిద్ కపూర్ తో కలిసి నటించిన ‘దేవా’ చిత్రం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కేవలం ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు, బాలీవుడ్ లో ఆమె చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గానే మిగిలింది.
Also Read : రెడ్ డ్రెస్ లో పూజ హెగ్డే గ్లామర్ ట్రీట్… ఆ సౌందర్యం చూసి కళ్ళు తిప్పుకోవడం కష్టమే!