https://oktelugu.com/

సుమతో విడాకులపై రాజీవ్‌ కనకాల క్లారిటీ !

యాంకర్ సుమ – రాజీవ్‌ కనకాల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటారు. కానీ, పాతికేళ్ల వీరి వివాహబంధంలో పొరపాచ్చాలు వచ్చాయని.. దాంతో ఇద్దరు విడిగా ఉంటున్నారని చాలా రోజుల నుండి చాలా రూమర్స్ వచ్చాయి. ఓ దశలో విడాకులు కూడా తీసుకోబోతున్నారని అన్నారు. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్‌ లోనే ఉంటూ కూడా ఇద్దరూ వేరువేరు ఇళ్లల్లో ఉన్నారు. భార్యాభర్తలు ఇలా వేరు వేరు ఇళ్ళల్లో ఉండటంతో ఈ రూమర్స్‌ మరింత […]

Written By: , Updated On : July 27, 2021 / 01:29 PM IST
Rajeev Kanakala Anchor Suma divorce
Follow us on


యాంకర్ సుమ – రాజీవ్‌ కనకాల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటారు. కానీ, పాతికేళ్ల వీరి వివాహబంధంలో పొరపాచ్చాలు వచ్చాయని.. దాంతో ఇద్దరు విడిగా ఉంటున్నారని చాలా రోజుల నుండి చాలా రూమర్స్ వచ్చాయి. ఓ దశలో విడాకులు కూడా తీసుకోబోతున్నారని అన్నారు. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్‌ లోనే ఉంటూ కూడా ఇద్దరూ వేరువేరు ఇళ్లల్లో ఉన్నారు.

భార్యాభర్తలు ఇలా వేరు వేరు ఇళ్ళల్లో ఉండటంతో ఈ రూమర్స్‌ మరింత బలంగా వ్యాపించాయి. అయితే తాజాగా రాజీవ్‌ కనకాల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో సుమకి దూరంగా ఉండటం గురించి క్లారిటీ ఇచ్చారు. బయట వచ్చిన రూమర్స్ బాధ కలిగించాయి. అయితే, నిజంగానే నేను సుమకి కొన్నిరోజులు దూరంగా ఉన్నాను.

కానీ సుమతో గొడవ వల్ల కాదు. మా అమ్మగారు చనిపోయిన తర్వాత నాన్నగారు (దేవదాస్‌ కనకాల) ఒక్కరే మణికొండలో ఉండేవారు. అప్పుడు మా నాన్నగారిని మేము ఉండే ఫ్లాట్‌ కు తీసుకువద్దాం అనుకున్నాం. అయితే, ఆయన ఆ ఇంట్లోనే ఉండాలని పట్టుబట్టారు. అలాగే ఆయన బుక్‌ లైబ్రరీ కూడా చాలా పెద్దది. దాంతో దాన్ని మా ఫ్లాట్‌ లోకి షిఫ్ట్‌ చేయడం కష్టమే.

ఈ కారణంగానే నేను మా నాన్నగారితో పాటు మణికొండ ఇంటిలో ఆయన చివరి వరకు ఆయనతోనే ఉండిపోయాను. అంతే కానీ, సుమతో విడిపోయి కాదు. ఆలాగే మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేము విడాకులు తీసుకుంటున్నాము అంటూ ఏవేవో వార్తలు వచ్చాయి. వాటిల్లో ఏమాత్రం నిజం లేదు. మేము చాల బాగున్నాం’ అంటూ రాజీవ్‌ చెప్పుకొచ్చాడు.