Rajasekhar comments on Biker movie: హీరోగా మూడు దశాబ్దాల పాటు విజయవంతమైన కెరీర్ ని ఎంజాయ్ చేసి , ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించిన సీనియర్ హీరో రాజశేఖర్, ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన ‘బైకర్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. శర్వానంద్ కెరీర్ లో మరో గొప్ప చిత్రం పడిందని , కచ్చితంగా ఈ సినిమా రాబోయే రోజుల్లో పెద్ద రేంజ్ కి వెళ్తుందని అంటున్నారు నెటిజెన్స్. మరి సినిమాకు అంత రేంజ్ ఉందా లేదా అనేది పక్కన పెడితే రాజశేఖర్ కి మాత్రం గొప్ప పాత్ర దొరికిందని , కచ్చితంగా ఇది చూసిన తర్వాత ఆయనకు ఇలాంటి పాత్రలు రాబోయే రోజుల్లో వస్తూనే ఉంటాయని చెప్పుకొస్తున్నారు నెటిజెన్స్.
నిన్న ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ ని నిర్వహించగా , రాజశేఖర్ మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘మా ఇంట్లో చిన్న పిల్లలు నన్ను డాక్టర్ మామ అని పిలుస్తుంటారు. ఎవరు కూడా తాతయ్య అని ఇప్పటి వరకు పిలవలేదు. కానీ బైకర్ చిత్రం లో ఈ అబ్బాయి నన్ను తాతయ్య అని పిలిచేలోపు చాలా ఫీల్ అయ్యాను. అనవసరంగా ఈ సినిమా ఒప్పుకున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఆలోచిస్తే , ఎలాగో జీవితం లో ఇప్పటి వరకు తాత అని పిలిపించుకోలేదు , ఇప్పుడు పిలిపించుకున్నాను, ఇది కూడా ఒక సరికొత్త అనుభూతి గా తీసుకున్నాను. సినిమాలో మా రిలేషన్ చాలా గొప్పగా వెండితెర పై పలికింది’ అంటూ చెప్పుకొచ్చాడు రాజశేఖర్. అంతే కాకుండా తనకు ఇంతమంచి పాత్ర ఇచ్చినందుకు నిర్మాత వంశీ కి కృతఙ్ఞతలు అంటూ ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు రాజశేఖర్.
Also Read: తమిళనాడు కి తదుపరి సీఎం నేనే అంటూ హీరోయిన్ త్రిష కామెంట్స్.. ఇదే నమ్మకం అంటే..
ఇక బైకర్ మూవీ కలెక్షన్స్ కూడా డీసెంట్ స్థాయిలోనే ఉన్నాయి. మొదటి రోజు ఈ చిత్రానికి 4 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు రాగా, రెండవ రోజు కూడా ఈ చిత్రానికి నూన్ షోస్ నుండే మంచి ఆక్యుపెన్సీలు నమోదు అవుతున్నాయి. కానీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఈ చిత్రం దాదాపుగా 35 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఎల్లుండి నుండి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం సాధించే హోల్డ్ ని బట్టే లాంగ్ రన్ ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది.
