Rajasekhar : మన ఇండియన్ ఆడియన్స్ పాన్ ఇండియన్ మూవీస్ కి, అదే విధంగా ఓటీటీ సినిమాలకు బాగా అలవాటు పడ్డారు. వీళ్ళను మెప్పించేలా ఒక సినిమా తీయాలంటే ఇప్పుడు మేకర్స్ పెద్ద అగ్ని పరీక్షే అని చెప్పొచ్చు. ఇలాంటి కాలంలో రీమేక్ సినిమాలను ఆడియన్స్ కన్నెత్తి కూడా చూడడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు ఒక్కటే ఒక మోస్తారు గా ఆడాయి కానీ, మిగిలిన హీరోల సినిమాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అయినప్పటికీ కొంతమంది హీరోలు రీమేక్ సినిమాలను చేసే సాహసం చేస్తున్నారు. ఇది నిజంగా వృధా ప్రయత్నమే. సదరు హీరోకి సంబంధించిన కాల్ షీట్స్, సమయం, శ్రమ అన్ని వృధా ప్రయత్నం లాగ మిగిలిపోతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ లో 7 ఏళ్ళ క్రితం మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ఒక చిత్రాన్ని, వరుస సూపర్ హిట్స్ ని అందుకున్న ఒక హీరో రీమేక్ చేస్తున్నాడు. దాని విశేషాలేంటో ఒకసారి చూద్దాం.
Also Read : చిరంజీవి, రాజశేఖర్ కి ఎందుకు గొడవలు జరుగుతుంటాయి..? వాళ్ల మధ్య వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే..?
‘గద్దర్ 2’, ‘జాట్’ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో మంచి ఊపు మీదున్న బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్(Sunny Deol), ఇప్పుడు ‘సూర్య’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. 2018 వ సంవత్సరం లో మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘జోసెఫ్’ అనే చిత్రానికి ఇది రీమేక్. ఇందులో జోజు జార్జ్ హీరో గా నటించాడు. ఇదే సినిమాని తెలుగులో సీనియర్ హీరో రాజశేఖర్, తన కూతురుతో కలిసి ‘శేఖర్’ అనే పేరు తో రీమేక్ చేసాడు. ఈ సినిమా విడుదలైన విషయం కూడా చాలా మందికి తెలియదు, అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. స్టోరీ ఏమిటంటే ఒక రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్ తన మాజీ భార్య ఒక యాక్సిడెంట్ లో చనిపోతే, దాని వెనుక ఉన్న కారణాలను వెతుకుతూ ఒక పెద్ద మెడికల్ మాఫియా సామ్రాజ్యాన్ని కనిపెడుతాడు. ఇది బయట ప్రపంచానికి ఎలా అయిన తెలిచేయాలని ఎవ్వరూ చేయని సాహసానికి పూనుకుంటాడు. ఈ క్రమం లో క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది.
ఈ చిత్రానికి M పద్మకుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు సన్నీ డియోల్ తో తీస్తున్న రీమేక్ కి కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది సన్నీ డియోల్ వయస్సుకు తగ్గ పాత్ర. అంతే కాకుండా తక్కువ బడ్జెట్ తో, పరిమితమైన సమయంలో, లొకేషన్స్ లో షూటింగ్ చేసే వెసులుబాటు ఉన్న చిత్రమిది. కానీ బిజినెస్ మాత్రం ఇలాంటి సినిమాలకు భారీగానే ఉంటాయి. పైగా సన్నీ డియోల్ వరుస సూపర్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్నాడు. కాబట్టే ఆయన ఈ చిత్రాన్ని ఒప్పుకొని చేశాడని, కచ్చితంగా సక్సెస్ అవుతుంది అనే నమ్మకం ఉందని మేకర్స్ అంటున్నారు. కానీ మాతృక ని ఎక్కువశాతం మంది చూసి ఉండుంటే మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది.
Also Read : రాజశేఖర్, శంకర్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? చేసుంటే పాన్ ఇండియన్ స్టార్ హీరో అయ్యేవాడు!