Rajasekhar: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను క్రియేట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాయి. ముఖ్యంగా ఒక ఇద్దరి ఈగో ల వల్ల ఎలాంటి అనర్ధాలు జరుగుతాయి. ఎవరు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అనే కాన్సెప్ట్ తో ‘రబ్బర్ పందు’ అనే సినిమా ఓటిటిలో అవలెబుల్ లో ఉంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ లో ఈ సినిమా అందుబాటులో ఉండటంతో ఇప్పటికే ఈ మూవీని చాలా మంది ప్రేక్షకులు చూసేసారు. ప్రస్తుతం ఈ మూవీని రాజశేఖర్ రీమేక్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రాజశేఖర్ కీలకపాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. తన భార్య పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. తన కూతురిగా శివాత్మిక తనను లవ్ చేసే క్యారెక్టర్ లో విశ్వదేవ్ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రిసల్ట్ ను ఇవ్వబోతోంది అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా తెలుగులో ఓటిటిలో అవలెబుల్ లో ఉండటం తో ఇప్పటికే చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు…
ఇక ఇలాంటి సినిమాను మళ్ళీ రీమేక్ చేయడం ఎందుకు ఒకరకంగా సినిమా ని సక్సెస్ఫుల్గా నిలవాపాలంటే ఒరిజినల్ కథతో సినిమా చేస్తే బాగుంటుంది. అది రీమేక్ సినిమా చేయడం అది కూడా తెలుగులో ఓటీటీ లో అందుబాటులో ఉన్న సినిమాను చేయడం వల్ల వీళ్ళు ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయగలుగుతారనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే రాజశేఖర్ చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అనే విజయాన్ని తెలుసుకున్న అతని అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. అలాగే ఇలాంటి ఒక సినిమా చేయడం వల్ల తనకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు కదా అనే ధోరణిలో కూడా కొంతమంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…
ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు మాత్రమే ఎక్కువ క్రేజ్ దక్కుతోంది… అప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన రాజశేఖర్ ఇప్పుడు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…