https://oktelugu.com/

Rajasekhar: ఎట్టకేలకు దిగొచ్చిన రాజశేఖర్!

కల్కి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా ఆడలేదు. దెయ్యం టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో హారర్ మూవీ చేశాడు. అది వచ్చిపోయిన విషయం కూడా తెలియదు.

Written By: , Updated On : October 17, 2023 / 08:54 AM IST
Rajasekhar

Rajasekhar

Follow us on

Rajasekhar: హీరో రాజశేఖర్ టాలీవుడ్ స్టార్స్ లో ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా హీరోగా ఉన్నారు. అనేక హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నారు. పవర్ ఫుల్ పాత్రలకు ఆయన పెట్టింది పేరు. అయితే కొన్నాళ్లుగా ఆయన గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. విజయాలు దక్కడం లేదు. మార్కెట్ కోల్పోయారు. అయినా పట్టువదలకుండా హీరోగా నిలబడే ప్రయత్నం చేశారు. ఈ మధ్య కాలంలో రాజశేఖర్ నటించిన గరుడవేగ మాత్రమే హిట్. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన కల్కి అంచనాల మధ్య విడుదలైంది.

కల్కి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ గా ఆడలేదు. దెయ్యం టైటిల్ తో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో హారర్ మూవీ చేశాడు. అది వచ్చిపోయిన విషయం కూడా తెలియదు. ఇక రాజశేఖర్ చివరిగా శేఖర్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. 2022లో శేఖర్ అనేక వివాదాల మధ్య విడుదలైంది. కొందరు ఈ చిత్ర విడుదలను ఆపే ప్రయత్నం చేశారు. శేఖర్ కూడా ప్రేక్షకాదరణ పొందలేదు.

కొన్నాళ్లుగా రాజశేఖర్ ని క్యారెక్టర్, విలన్ రోల్స్ కోసం దర్శకులు సంప్రదిస్తున్నారు. అయితే రాజశేఖర్ ఒప్పుకోవడం లేదు. ఇంకా హీరోగా చేయాలనే ఆశతోనే ఉన్నారు. ఎట్టకేలకు ఆయన దిగొచ్చారు. నితిన్ లేటెస్ట్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్ చిత్రంలో ఆయన కీలక రోల్ చేస్తున్నారు. నిన్న ఆయన సెట్స్ లో అడుగుపెట్టారు. చిత్ర యూనిట్ ఘన స్వాగతం పలికింది. ఈ మూవీలో ఆయన రోల్ ఏంటనేది స్పష్టంగా తెలియదు.

ఎవరైనా పరిస్థితులకు అనుగుణంగా పోవాల్సిందే. అర్జున్, జగపతిబాబు, శ్రీకాంత్ వంటి హీరోలు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ మారిన విషయం తెలిసిందే. కేవలం కొందరు సూపర్ స్టార్స్ మాత్రమే లైఫ్ టైం హీరోలుగా కొనసాగుతారు. టైర్ టూ హీరోలకు ఆ ఛాన్స్ ఉండదు. అపజయాలు మొదలయ్యాక హీరోగా ఆఫర్స్ రావు. ఇక ఎక్స్ట్రా ఆర్డినరీ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకుడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 8న విడుదల కానుందని సమాచారం.