Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఏడవ వారం నామినేషన్స్ మంచి హీట్ మీద జరిగాయి. కంటెస్టెంట్స్ ఓ రేంజ్ లో ఒకరినొకరు తిట్టుకొని వాదించుకున్నారు.ఇక ఈ సారి నామినేషన్స్ లో డప్పు బిడ్డ ని వాయించేశారు హౌస్ మేట్స్. మెజారిటీ హౌస్ మేట్స్ భోలే ని టార్గెట్ చేసి నామినేట్ చేశారు. భోలే ని నామినేట్ చేస్తూ అమర్ దీప్,శోభా,ప్రియాంక,అర్జున్,పూజ గట్టిగానే గొడవ పడ్డారు. భోలే కి మాట్లాడటం రాదు,ఎలా ప్రవర్తించాలో కూడా తెలియడం లేదు. ఒక్కొక్క సారి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు.ఆయన తీరు ఇలాగే గనుక ఉంటే హౌస్ లో రాణించడం చాలా కష్టం.
ఇక లైవ్ ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయినట్లు తెలుస్తుంది.ఆ లిస్ట్ లో ఉన్నా వారు ఎవరంటే .. భోలే, అశ్విని శ్రీ, శోభా శెట్టి,ప్రియాంక,తేజా,ప్రశాంత్, శివాజీ,సందీప్,గౌతమ్ లిస్ట్ లో ఉన్నారు. శివాజీ,ప్రశాంత్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరే నామినేట్ అయినట్టు తెలుస్తుంది.
శివాజీ వెళ్లిపోయారు కదా నామినేషన్ లో ఎలా ఉంటారు అంటే అదే ట్విస్ట్. భుజం గాయంతో బాధపడుతున్న శివాజీ వైద్య పరీక్షల కోసం బయటకు వెళ్లి మరలా వచ్చాడు.ఇక నామినేషన్ లిస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంచనా ఉంటుంది. గత ఆరు వారాలు వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేటైన విషయం తెలిసిందే. ఇదో రికార్డు ఐ చెప్పొచ్చు.
తొలి వారంలోనే భోలే వెళ్ళిపోతాడు అని చర్చ మొదలైంది. ఇప్పుడు భోలే నామినేషన్స్ లోకి వచ్చాడు. మరి ఈయన అదృష్టం ఎలా ఉందో చూడాలి. ఒకటి మాత్రం వాస్తవం ఈ బిగ్ బాస్ ఆటకి భోలే సెట్ కాడు. అతనికి ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదు. బయట ఉన్నట్టు ఇక్కడ కూడా అలాగే ఉంటున్నాడు. బాగా ఆడి తన సత్తా ఏంటో చూపిస్తాడో లేక తట్టాబుట్టా సర్దుకుని బయటికి వస్తాడో చూడాలి.