https://oktelugu.com/

Leo: విడుదలకు ముందే లియో రికార్డులు… యూఎస్ ప్రీమియర్స్ తో మ్యాజిక్ ఫిగర్

వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి లియో రూ. 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం మీద ఆసక్తి ఉంది.

Written By:
  • Shiva
  • , Updated On : October 17, 2023 / 08:57 AM IST

    Leo Collection

    Follow us on

    Leo: లియో చిత్ర ట్రైలర్ ఒకింత నిరాశపరిచింది. ఊహించిన స్థాయిలో లేదని కొందరు పెదవి విరిచారు. లియో దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమే లియో అనే భావన జనాల్లో ఉంది. ప్రకటన ప్రోమో అద్భుతంగా ఉంది. ట్రైలర్ దానికి సంబంధం లేకుండా ఉంది. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో లియోకి సంబంధం లేదేమో అనిపిస్తుంది. అలాగే ట్రైలర్ విడుదల అనంతరం లియో కాపీ ఆరోపణలు ఎదుర్కొంది. ఇది హాలీవుడ్ హిట్ మూవీ ది హిస్టరీ ఆఫ్ వైలెన్స్ ని తలపిస్తుందన్న వాదన వినిపించింది.

    అయితే ఇవేవి ఆ సినిమా మీదున్న క్రేజ్ తగ్గించలేకపోయాయి. విడుదలకు మరో రెండు రోజులు ఉండగానే లియో భారీ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసింది. డొమెస్టిక్ గా, ఓవర్సీస్ లో లియో వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఒక్క గంటలో బుక్ మై షోలో 80000 టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక యూఎస్ లో అడ్వాన్స్ సేల్స్ తో $ 1 మిలియన్ మార్క్ దాటేసింది. వన్ మిలియన్ అనేది మ్యాజిక్ ఫిగర్ అని చెప్పొచ్చు. అలాంటిది విడుదలకు ముందే లియో ఆ మార్క్ చేరుకుంది.

    వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి లియో రూ. 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయం అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం మీద ఆసక్తి ఉంది. రూ. 16 కోట్లకు లియో తెలుగు రాష్టాల హక్కులు అమ్ముడుబోయినట్లు సమాచారం. హిట్ టాక్ తెచ్చుకుంటే దానికి రెట్టింపు వసూళ్లు సాధ్యమే. విక్రమ్, జైలర్ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు వసూళ్లు రాబట్టి భారీ లాభాలు పంచాయి.

    ఇక లియో మూవీలో విజయ్ రెండు షేడ్స్ లో కనిపిస్తున్నాడు. రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్ గా ఒక పాత్ర, ఫ్యామిలీ మెన్ గా మరొక పాత్ర. విజయ్ డ్యూయల్ రోల్ చేశారా? లేక ఇద్దరూ ఒకటేనా? అనేది సస్పెన్సు. విజయ్ కి జంటగా త్రిష నటిస్తుంది. అర్జున్, సంజయ్ దత్ కీలక రోల్స్ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. అనిరుధ్ సంగీతం అందించారు.