Rajasaab Producer Case: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(The Rajasaab) ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కావడం లేదని, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల చేయబోతున్నారనే టాక్ కూడా ఉంది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ కూడా విడుదల తేదీ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, హిందీ వాళ్ళు డిసెంబర్ లో చేయమంటున్నారు, మన టాలీవుడ్ బయ్యర్స్ జనవరి లో విడుదల చేయమంటున్నారు. చూస్తున్నాం, మాకు ఏది బెటర్ డేట్ అనిపిస్తే ఆ డేట్ లో విడుదల చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రీసెంట్ గా ఈ చిత్రం లీగల్ సమస్యల్లో చిక్కుకుంది.
Also Read: ప్రపంచ రికార్డు నెలకొల్పిన పవన్ కళ్యాణ్..ఇది ఎవరికీ సాధ్యం కాదు!
ఈ లీగల్ సమస్యల కారణంగా ఈ సినిమా డిసెంబర్, జనవరి నెలల్లో విడుదల అవ్వడం అసాధ్యం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు పూర్తి సమస్య ఏంటో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ‘రాజా సాబ్’ ఫైనాన్షియల్ పార్టనర్ IVY ఎంటర్టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా ఎంటెర్టైమెంట్స్ పై ఢిల్లీ హై కోర్టు లో కేసు వేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో కాంట్రాక్టు రద్దు చేసుకుంటూ, మేము ఈ సినిమా కోసం ఖర్చు చేసిన 218 కోట్లు తక్షణమే చెల్లించాలని, సినిమాని చెప్పిన టైం లో వాళ్ళు పూర్తి చేయలేకపోయారని, అంతే కాకుండా పెట్టిన 218 కోట్ల బడ్జెట్ లో కూడా లెక్కలు గురించి అడిగితే అసలు చెప్పడం లేదని ఫిర్యాదు లో పేర్కొంది. మరో పక్క పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఢిల్లీ హై కోర్ట్ లో కౌంటర్ పిటీషన్ ని ఫైల్ చేశారు. చూస్తుంటే ఈ సమస్య ఇప్పట్లో సర్దుకునేలా అనిపించడం లేదు.
Also Read: ‘వార్ 2’ మూవీ యూఎస్ఏ రివ్యూ
ఇది కాసేపు పక్కన పెడితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ‘రాజా సాబ్’ కి సంబంధించిన ఓటీటీ డీల్ ని కూడా పూర్తి చెయ్యలేదు. ఇతర నాన్ థియేట్రికల్ బిజినెస్ గురించి కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదట. దీంతో చిరాకు పడిన IVY ఎంటర్టైన్మెంట్ సంస్థ ఢిల్లీ హై కోర్ట్ లో కేసు వేసినట్టు తెలుస్తుంది. దీంతో ఈ సినిమా కూడా ఎక్కడ ‘హరి హర వీరమల్లు’ లాగా పాతబడిన సినిమా అయిపొతుందెమో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాది స్టార్ హీరోల నుండి వరుసగా క్రేజీ పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే రాబోతున్నాయి. వాటి ముందు రాజా సాబ్ ఒక మామూలు కమర్షియల్ సినిమా మాత్రమే. ఇలాంటి సినిమాలు వచ్చే ఏడాది నిలబడడం కష్టం, సాధ్యమైనంత తొందరగా ఈ ఏడాది లోనే ఈ సమస్యలకు పరిష్కారం చేసుకొని డిసెంబర్ లేదా సంక్రాంతికి విడుదల చేసుకుంటే బెటర్ అనేది అభిమానుల అభిప్రాయం.
#TheRajaSaab in a Legal Mess!
People Media & Hindi/Financial Partners IVY have approached Delhi HC against each other!
The Film is yet to lock it’s Non-Theatrical Deal and this ongoing dispute has ruled it out of 2025 Release. pic.twitter.com/wqzXa9dD6a
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) August 13, 2025