Rajasaab : సినిమాల్లో కనిపించే హీరోలు డ్యాన్స్, ఫైట్లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటారు. హీరోల పని బాగుంది అంటూ సగటు ప్రేక్షకులు వాళ్లని చూసి ఈర్ష పడుతుంటారు. కానీ వాళ్లు ఫుడ్ విషయంలో డైట్ మెయింటెన్ చేస్తూ ఇష్టమైన ఆహారాన్ని తినలేక ఆకలిని చంపుకుంటూ బతుకుతూ ఉంటారు. ఈ విషయాలు సినిమా చూసే ప్రేక్షకులకు అర్థం కావు. హీరోలు అంటే కార్లలో తిరుగుతూ ఏసీల్లో ఉంటారు అనే ఒక్క పాయింట్ ను ప్రేక్షకులు హైలెట్ చేస్తు చూస్తూ మనకంటే వాళ్ళ పనే బాగుంది అనుకుంటారు. కానీ వాళ్ళు మనకంటే ఎక్కువ కష్టపడతారు అనే విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోరు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక ప్రభాస్ (Prabhas)లాంటి నటుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.ఎప్పుడైతే బాహుబలి (Bahubali) సినిమా వచ్చిందో అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తు సక్సెస్ లను అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ భారీ విజయాలను సాధిస్తాయని అభిమానులు మంచి కన్ఫిడెంగ్ తో ఉన్నారు. ఇక ఇప్పటికే ఆయన హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ(Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ సినిమా కూడా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : లీకైన రాజాసాబ్ సినిమా స్టోరీ…ఇందులో ప్రభాస్ చనిపోతాడా..? ఇదేం కథ సామీ ఇలా ఉంది…
కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా అనుకున్న డేట్ కి రిలీజ్ అయ్యే అవకాశాలైతే లేవనే విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందట. ప్రభాస్ కు సంబంధించిన కొన్ని సీన్లను చిత్రీకరించాల్సిన అవసరమైతే ఉందట…
12 రోజులపాటు ప్రభాస్ డేట్స్ ని కేటాయిస్తే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. కానీ ప్రభాస్ మాత్రం ఫౌజీ సినిమా మీద తన డేట్స్ కేటాయిస్తూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఈ సినిమాను పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే రిలీజ్ కి మరొక నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపధ్యం లో ఇప్పుడప్పుడే ఈ సినిమాని చేసి రిలీజ్ చేసే అవకాశమైతే లేనట్టుగా కనిపిస్తుంది.
తద్వారా కొత్త డేట్ ని కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం తను చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి రాజాసాబ్ మూవీ విషయంలో మాత్రం ఆయన చాలా వరకు నెగ్లెట్ చేసినట్టుగా కనిపిస్తోంది… మరి వీలైనంత తొందరగా ఆ సినిమా మీదకూడా డేట్స్ కేటాయిస్తే ఆ సినిమాను కూడా పూర్తవుతుంది…
Also Read : రాజాసాబ్ పరిస్థితి ఏంటి..? రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా వేస్తున్నారా..?