Rajasaab : చాలా మంది స్టార్ డైరెక్టర్లు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది చిన్నదర్శకులు సైతం భారీ సక్సెస్ పను అందుకుంటున్న క్రమంలో స్టార్ డైరెక్టర్లు వాళ్లకు డేట్స్ ఇచ్చి వాళ్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు స్టార్ హీరోలను ఎలా హ్యాండిల్ చేస్తారు వాళ్ళు ఇచ్చే డేట్స్ ని ఎలా ఉపయోగించుకుంటారు. అనేదాని మీదనే వాళ్ళ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది…
చిన్న సినిమాలను చేస్తూ స్టార్ డైరెక్టర్ గా మంచు గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు మారుతి (Maruthi)…ఆయన సంవత్సరానికి దాదాపు రెండు నుంచి మూడు సినిమాలను చేసుకుంటూ తన కెరీర్ ను సాఫీగా తీసుకెళుతున్న క్రమంలో ప్రభాస్ (Prabhas) తో సినిమా ఆఫర్ వచ్చింది. దాంతో దాదాపు నాలుగు సంవత్సరాలుగా అదే సినిమా మీద తను పూర్తిగా నిమగ్నమై ఉండటం అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాజాసాబ్ (Rajasaab) పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఘోస్ట్ గా నటించబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలోనే మారుతి తన కెరియర్ ను పణంగా పెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు నాలుగు సంవత్సరాలలో మారుతి 7 నుంచి 8 సినిమాలు చేసుకునేవాడు. కానీ ప్రభాస్ డేట్స్ ఇవ్వడంతో ఈ సినిమాకు స్టిక్ అయిపోయాడు ఉన్నాడు… మరి ఇలాంటి సందర్భంలో ప్రభాస్ మాత్రం రాజాసాబ్ సినిమా గురించి అసలు పట్టించుకోవడం లేదనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికి రిలీజ్ డేట్ సమయానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమైతే లేదు అంటూ మేకర్స్ క్లారిటీ ఇస్తున్నారు. ఇక కొత్త రిలీజ్ డేట్ ని తొందర్లోనే అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ లో ఉన్న ప్రభాస్ రాజాసాబ్ సినిమా కోసం డేట్స్ ఎప్పుడు కేటాయిస్తాడు.
ఈ సినిమా ను ఎప్పుడు ఫినిష్ చేస్తాడనే విషయంలో మాత్రం సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ప్రభాస్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు అని కొంతమంది సినిమా మేధావులు సైతం ప్రభాస్ మీద ఫైర్ అవుతున్నారు.ఇక ఏది ఏమైనా కూడా మారుతీ మాత్రం ఈ సినిమా ద్వారా భారీగా నష్టపోయాడనే చెప్పాలి. ఒకవేళ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయి పాన్ ఇండియాలో తను స్టార్ డైరెక్టర్ గా మారితే తప్ప ఈ సినిమా డిజాస్టర్ అయితే మాత్రం ఆయన కెరియర్ ని చాలా వరకు కోల్పోతాడనే చెప్పాలి.
మరి మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్న మారుతి ఈ సినిమాతో అయిన స్టార్ డైరెక్టర్ గా అవతరిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా తర్వాత ఆయన చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఆ వార్తల్లో నిజం ఉందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…