https://oktelugu.com/

Rajasaab : లీకైన రాజాసాబ్ సినిమా స్టోరీ…ఇందులో ప్రభాస్ చనిపోతాడా..? ఇదేం కథ సామీ ఇలా ఉంది…

తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే ప్రస్తుతం అందరికీ ప్రభాస్ మాత్రమే గుర్తుకొస్తున్నాడు. కారణమేంటంటే ఆయన చేసిన బాహుబలి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది...

Written By: , Updated On : February 13, 2025 / 09:43 AM IST
Rajasaab

Rajasaab

Follow us on

Rajasaab : బాహుబలి (Bahubali) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న హీరో ప్రభాస్ (Prabhas)…అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ సక్సెస్ లుగా నిలవడమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పిస్తూ రావడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఒకవేళ అతడి సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మినిమం గ్యారంటీ వసూళ్లను రాబడుతున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన తీసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. అందుకే వరుసగా మంచి దర్శకులను ఎంచుకొని వారితో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేయబోతున్నాడు. వీటితో పాటుగా మారుతి డైరెక్షన్ లో చేస్తున్న ‘రాజాసాబ్’ (Rajasaab) సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా మార్చిలో రిలీజ్ అవుతుంది అంటూ మొదట ప్రచారం చేసినప్పటికి ఇప్పుడు మాత్రం మార్చి నుంచి మళ్లీ వేరే డేట్ కి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ ఘోస్ట్ గా కనిపించబోతున్నాడు… నిజానికి ఈ సినిమాలో ప్రభాస్ చనిపోతాడు. తన పర్సనల్ విషయాల వల్ల చనిపోయిన ఆయన ఎవరి మీద రివెంజ్ తీర్చుకుంటాడు.

ఎందుకోసం ఆయన ఘోస్ట్ గా మారి జనాల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తనని చంపిన వాళ్లను చంపడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతాడా? అనే పాయింట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతూ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడమే ఈ సినిమా స్టోరీ గా తెలుస్తోంది.

ఇది ఏమైనా కూడా ఈ స్టోరీ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. తద్వారా ఈ సినిమా స్టోరీ అద్భుతంగా ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే మరి కొంతమంది మాత్రం ఇది రొటీన్ ఫార్ములా స్టోరీ లానే ఉంది. మారుతి ఈ సినిమాతో ప్రభాస్ ని ఏ విధంగా చూపిస్తాడు. తద్వారా ఈ సినిమా సక్సెస్ బాట పడుతుందా?

లేదంటే డిజాస్టర్ గా మిగులుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఈ సినిమా మీద తొందరలోనే డేట్స్ కేటాయించి సినిమా మొత్తాన్ని ఫినిష్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది…