Director Maruthi: ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(The Rajasaab) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాదాపుగా 120 కోట్ల రూపాయిల నష్టాలను మిగిలించి ఇండియా లోనే టాప్ 5 బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిల్చింది ఈ చిత్రం. విడుదలకు ముందు ఈ సినిమా డైరెక్టర్ మారుతీ చేసిన కామెంట్స్ చూస్తే, ఎదో అద్భుతాన్ని తెరకెక్కించాడు , మనమే మారుతీ ని తక్కువ అంచనా వేశాం అని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. రిలీజ్ ట్రైలర్ కూడా మెంటలెక్కిపోయే రేంజ్ లో ఉండడం తో, ప్రభాస్ ఖాతాలో మరో 500 కోట్ల గ్రాస్ రాబోతుందని చెప్పుకొచ్చారు. కానీ తీరా చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ తల ఎత్తుకోలేని చిత్రాన్ని అందించాడు మారుతి.
ఈ సినిమా విడుదల తర్వాత ఆయన ఎక్కడ బయట కనపడలేదు , సోషల్ మీడియా లో కూడా ఈ చిత్రం గురించి మాట్లాడలేదు. థియేటర్స్ లో రన్ అవుతున్నానని రోజులు ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి ని ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని రకాలుగా తిట్టారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతీ ‘సినిమా మీకు నచ్చకపోతే.. నా ఇంటి అడ్రస్ ఇస్తున్నా , వచ్చేయండి’ అని మాట్లాడడం ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రభాస్ ఫ్యాన్స్ ఆ అడ్రస్ కి రోజుకి వందల సంఖ్యలో పోస్టులు పంపడం , స్విగ్గీ లో ఆర్డర్లు ఆ అడ్రస్ కి పెట్టడం, ఇలా రకరకాలుగా , సరికొత్త పద్దతులతో టార్చర్ చేశారు. ఇదంతా పక్కన పెడితే సినిమా విడుదలైన ఇన్ని రోజులకు డైరెక్టర్ మారుతీ ఒక పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘మన చుట్టూ సోషల్ మీడియా లో అయినా, బయట అయినా నెగెటివ్ ఆలోచనలతో ఉండే మనుషులు ఉంటారు. వాళ్ళ మధ్యలో మనం పాజిటివ్ ఆలోచనలతో ఉంటూ , సమాజాన్ని మంచి దిశగా చూడడం చాలా కరమైన పని’ అంటూచెప్పుకొచ్చాడు మారుతీ. అంతే కాకుండా ప్రతీ ప్రయాణం మనకు కొత్త గుణపాఠం నేర్పుతుందని , తన కొత్త సినిమాని త్వరలోనే ప్రకటిస్తానని , స్క్రిప్ట్ పనులు చివిరికి వచ్చిందని , దేవుడి దయతో మళ్లీ కం బ్యాక్ ఇస్తానని , అన్ని సమయాల్లోనూ నాకు సపోర్టుగా నిలుస్తూ వచ్చిన ప్రేక్షకులకు , మీడియా మిత్రులకు కృతఙ్ఞతలు అంటూ ఆయన చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఇకపోతే మారుతీ తో తదుపరి పని చేయబోయే హీరో ఎవరు అనే దానిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.