Rajani Pandit: బాండ్.. జేమ్స్ బాండ్.. అని పేరు చెప్పగానే ఒక రకమైన బ్యాగ్రౌండ్ స్కోర్ వస్తుంది. ఆ తర్వాత జేమ్స్ బాండ్ చేసే సాహసోపేతమైన పనులు కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. జేమ్స్ బాండ్ సినిమాలు డిటెక్టివ్ విధానంలో సాగుతూ ఉంటాయి. ఒక సమస్యను ఎవరూ పరిష్కరించకపోతే.. అది జేమ్స్ బాండ్ దృష్టిలోకి వెళ్లడం.. అతడు తనదైన శైలిలో పరిష్కరించడం.. ఇలా సాగిపోతూ ఉంటుంది సినిమా. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఓ లేడీ జేమ్స్ బాండ్ కు సంబంధించింది. కాకపోతే ఇది రీల్ స్టోరీ కాదు. రోమాలు నిక్కబొడిచే రియల్ స్టోరీ.
Also Read: తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!
ఆమె పేరు రజిని పండిట్. స్థలం మహారాష్ట్ర. ఆమె తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్. తల్లి హౌస్ వైఫ్. చిన్నప్పటి నుంచి రజినీకి మిస్టరీ, డిటెక్టివ్ నవలలు అంటే చాలా ఇష్టం. 1980 కాలంలోనే ఆమె డిటెక్టివ్ గా మారారు. ఆ రంగంలో ఏకంగా 30 సంవత్సరాల అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. ఏకంగా 80 వేలకు పైగా కేసులను పరిష్కరించారు. తద్వారా మనదేశంలో మొట్టమొదటి మహిళా డిటెక్టివ్ గా పేరు తెచ్చుకున్నారు.. రజిని మొబైల్ లోని రూప రెల్ కాలేజీలో మరాఠాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ కాలంలోనే వ్యసనాలకు బానిసైన ఓ యువతి ఉదంతం ఆమె దృష్టికి వచ్చింది. ఆ తర్వాత ఆమె యువతి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఆమె తల్లిదండ్రులను సంప్రదించి పూర్తి విషయాలు తెలుసుకొని.. యువతి కేసును పరిష్కరించారు. ఇక అప్పటినుంచి ఆమె లేడీ డిటెక్టివ్ గా మారిపోయారు. అప్పటినుంచి అనేక కేసులు పరిష్కరించారు. అప్పట్లో మీడియా ఈమె గురించి విపరీతంగా కథనాలు రాసేది. ఆ కథనాలలో ఈమెను “లేడీ షేర్లాక్”, “లేడీ జేమ్స్ బాండ్” అని పిలిచేవారు. అయితే వారెవరో కూడా రజనీకి తెలియకపోవడం ఇక్కడ అసలు విశేషం.
అప్పుడే తెలిసింది
రజని గురించి మహారాష్ట్ర మీడియా గొప్పగానే రాసినప్పటికీ.. దేశవ్యాప్తంగా తెలిసింది మాత్రం 1989లో. “హమ్ కిసి సే కం నహీన్” అనే షోలో రజిని పాల్గొన్నారు. అది దూరదర్శన్ లో ప్రసారమైంది. ఆ కార్యక్రమం ద్వారా ఆమె ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ఇక అప్పటినుంచి ఆమెకు కేసులు విపరీతంగా వచ్చాయి. దీంతో మొబైల్ లోని శివాజీ పార్క్ లో రజిని తన ఏజెన్సీ కార్యాలయాన్ని మొదలుపెట్టారు. ప్రారంభంలో ప్రతి కేసును రజిని తీసుకునేవారు.. అయితే కొన్ని కేసులు ఆమెకు ఇబ్బంది కలిగించాయి. పరిష్కరించిన కేసులో ఎంత డబ్బులు తీసుకోవాలో కూడా తెలియక చాలా సందర్భాల్లో రజిని మోసపోయారు. కేసుల పరిష్కారంలో చాలా సందర్భాలలో ఆమె పనిమనిషిగా.. చూపు కోల్పోయిన మహిళగా.. చిరు వ్యాపారిగా.. మానసిక రోగిగా నటించాల్సి వచ్చింది. కేసులు పరిష్కరించే క్రమంలో కొన్ని సందర్భాలలో ఆమె బెదిరింపులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే రజనికి పోలీస్ శాఖలు అప్పట్లో పనిచేయాలని ఆఫర్లు కూడా లభించాయి. వాటన్నింటినీ ఆమె తిరస్కరించారు. సొంతంగా పనిచేయడం.. క్లిష్టమైన కేసులను పరిష్కరించడం.. బాధితుల ముఖాలలో ఆనందాన్ని చూడడం ఆమెకు చాలా ఇష్టం. ఇక ఇప్పటికాలంలోనూ ఆమెకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సస్పెన్స్ థ్రిల్లర్ తరహా సినిమాలు తీసే వారంతా కూడా రజిని సంప్రదిస్తూనే ఉంటారు.