Homeఎంటర్టైన్మెంట్Varanasi Sequel: 'వారణాసి' సీక్వెల్ పై రాజమౌళి సంచలన ప్రకటన..వీడియో వైరల్!

Varanasi Sequel: ‘వారణాసి’ సీక్వెల్ పై రాజమౌళి సంచలన ప్రకటన..వీడియో వైరల్!

Varanasi Sequel: ఈమధ్య కాలంలో అవసరం ఉన్నా లేకపోయినా సీక్వెల్స్ ని ప్రకటించడం చాలా సాధారణం అయిపోయింది. అసలు ఈ సినిమాలో స్టోరీ ఏముందని సీక్వెల్ ప్రకటించారు? అని మనకి ఎన్నో సందర్భాల్లో అనిపించి ఉండొచ్చు. అయితే మంచి క్రేజ్ ఉన్న సినిమాలకు సీక్వెల్స్ తీసి భారీ బ్లాక్ బస్టర్స్ ని కూడా అందుకోవచ్చు అని నిరూపించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ‘పుష్ప 2’, ‘KGF 2’ అలాంటివే. రాజమౌళి(SS Rajamouli) కూడా కచ్చితంగా ‘వారణాసి'(Varanasi Movie) ని రెండు భాగాల్లో , లేదా మూడు భాగాల్లో తీస్తాడని మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ వాళ్ళ ఆశలపై రాజమౌళి నీళ్లు చల్లాడు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన ‘వారణాసి’ సీక్వెల్ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాని ముందుగా రెండు భాగాలుగా తియ్యడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది పరిగణలోకి తీసుకున్నాం. ఆ దిశగా వర్క్ కూడా జరిగింది. కానీ ఎందుకో ఈ కథకు రెండు భాగాలు ఉండాల్సిన అవసరం లేదని అనిపించింది. కేవలం సింగిల్ సినిమాగానే ఈ చిత్రం తెరకెక్కుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఒకవేళ రెండు భాగాలుగా తీస్తే, రాజమౌళి తో రెండు సార్లు సినిమా చేసిన ఫీలింగ్ కలుగుతుందని, రెండు సార్లు పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసాము అనే తృప్తి ఉంటుందని మహేష్ ఫ్యాన్స్ చాలా ఆశపడ్డారు. కానీ ఆ ఛాన్స్ లేదని రాజమౌళి తేల్చి చెప్పేసాడు. ఇకపోతే ఈ చిత్రంలో మైథాలజీ కాన్సెప్ట్ తో పాటు, గొప్ప అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కించమని రాజమౌళి చెప్పుకొచ్చాడు. 2023 లో విడుదలైన ప్రభాస్ ‘కల్కి ‘ చిత్రం కూడా ఇలాంటిదే.

మైథాలజీ + సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఆ సినిమా తెరకెక్కితే, ‘వారణాసి’ చిత్రం మైథాలజీ + అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతోంది. కల్కి చిత్రం లో ‘మైథాలజీ’ భాగాన్ని కేవలం 5 నిమిషాలు మాత్రమే చూపిస్తారు. కానీ ‘వారణాసి’ లో 25 నుండి 30 నిమిషాల వరకు మైథాలజీ పార్ట్ ఉంటుందట. ఇందులో మహేష్ బాబు శ్రీ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. కేవలం రాముడి గెటప్ లో ప్రేక్షకులను మెప్పించడం కోసం మహేష్ బాబు ఆరు నెలల పాటు ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. ఈ విషయాన్నీ స్వయంగా మహేష్ బాబు రీసెంట్ గా జరిగిన హాలీవుడ్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 50 శాతం పూర్తి అయ్యింది. సెప్టెంబర్ లోపు మిగిలిన షూటింగ్ కూడా పూర్తి అవుతుందట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version