Rajamouli Viral Video: మహేష్ బాబు(Superstar Mahesh Babu) అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న #Globetrotter ఈవెంట్ ఎల్లుండి రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ ఈవెంట్ ని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. సుమారుగా మూడు నిమిషాల గ్లింప్స్ వీడియో ని ఈ ఈవెంట్ లో ప్రదర్శించబోతున్నారని టాక్. సుమారుగా 50 వేలమంది మహేష్ అభిమానులు ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్న పృథ్వీ రాజ్ , హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్స్ విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. అంతే కాకుండా మొన్న విడుదల చేసిన ‘సంచారి’ థీమ్ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఈ చిత్రం నుండి వచ్చిన ప్రతీ కంటెంట్ బాగా పేలడం అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే ఎల్లుండి జరగబోయే ఈవెంట్ కి సంబంధించి రాజమౌళి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక వీడియో ని విడుదల చేసాడు. అందులో ఆయన మాట్లాడుతూ ‘మన #Globetrotter ఈవెంట్ కోసం మీరంతా ఎంతో ఉత్సాహం గా ఎదురు చూస్తున్నారో నాకు బాగా తెలుసు. నేను కూడా మీలాగే ఎదురు చూస్తున్నాను.ఈ ఈవెంట్ అనుకున్న విధంగా అద్భుతంగా జరగాలంటే మీ సహకారం కచ్చితంగా కావాలి. మన ఈవెంట్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు చాలా స్ట్రిక్ట్ సూచనలు జారీ చేశారు. అవన్నీ మనం కచ్చితంగా పాటించాలి. ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది ఓపెన్ ఈవెంట్ కాదు. ఫిజికల్ పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలకు రావాలి. నేను కొన్ని వీడియోస్ చూసాను. ఇది ఓపెన్ ఈవెంట్ అని, ఎవరు పడితే వాళ్ళు రావొచ్చని,అలాగే ఆన్లైన్ లో పాసులు అమ్ముతున్నారు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నా దృష్టికి వచ్చింది’.
‘దయచేసి అలాంటివి నమ్మకండి. 15 వ తేదీన రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ క్లోజ్ చేయబడుతుంది’ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో మీరే ఈ క్రింది వీడియో లో చూడండి. ఈ ఈవెంట్ కి మూవీ టీం తో పాటు ఒక ప్రత్యేక అతిథి కూడా వస్తాడని కొందరు, అలా కాకుండా రాజమౌళి హీరోలందరూ వస్తారని మరికొందరు కామెంట్స్ చేశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదట. కేవలం మూవీ టీం మాత్రమే ఈ ఈవెంట్ లో పాల్గొంటారట. అదే విధంగా ఏ యూట్యూబ్ ఛానల్ లో కూడా ఈ ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ అవ్వదు. కేవలం జియో హాట్ స్టార్ లో మాత్రమే ఈ ఈవెంట్ ని మనం ఎక్సక్లూసివ్ గా లైవ్ చూడొచ్చు.
Very excited to see you all at the #Globetrotter event on November 15.
The RFC main gate will be closed on the event day. Follow the instructions on your entry pass. Cooperate with police and security to ensure a hassle-free, safe, and happy experience for everyone. pic.twitter.com/bG3Hw5XmD8
— rajamouli ss (@ssrajamouli) November 13, 2025