Rajamouli RRR: “ఆర్ఆర్ఆర్” (RRR Movie) అక్టోబర్ 13న రిలీజ్ కావట్లేదు అనేది క్లారిటీ వచ్చింది. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? ఎంత పాన్ ఇండియా సినిమా అయితే మాత్రం, ఎన్ని భారీ అంచనాలు ఉంటే మాత్రం.. అభిమానులు ఒకసారి విసిగిపోయారు అంటే.. ఇక మళ్ళీ ఆ సినిమా పై ఆసక్తి పెంచుకోరు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఇది జరిగేలా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మూడు సార్లు వాయిదా పడింది.
రాజమౌళి మాత్రం కొత్త డేట్ ఎప్పుడు చెబుతాడా ? అని ఎదురు చూస్తున్నారు మిగిలిన సినిమా వాళ్లు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ ను బట్టి తమ సినిమాల రిలీజ్ ను ప్లాన్ చేసుకోవాలని వారి ఆశ. కానీ, రాజమౌళి మాత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. అలాగే అక్టోబర్ 13 నుంచి సినిమాని వాయిదా వేశామని కూడా రాజమౌళి చెప్పలేదు.
జక్కన్న (Rajamouli) చెప్పకపోయినా ఇండస్ట్రీలో ఆ రిలీజ్ పై స్పష్టత వచ్చింది. అందుకే, అక్టోబర్ 8, 13 తేదీలకు పలు చిన్న చిత్రాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. మరి “ఆర్ఆర్ఆర్” రిలీజ్ పరిస్థితి ఏమిటి ? నిజానికి ఈ సినిమా విషయంలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు ఆదరాభిమానాలను చూపించడం లేదు.
“దోస్తీ” అనే మొదటి పాటను చాలా గ్రాండ్ గా షూట్ చేసి వదిలారు జక్కన్న. కానీ ఆ పాటకు సినిమా స్థాయికి తగ్గ ఆదరణ లేదు. అంతకు ముందు ఎన్టీఆర్ పై ఒక టీజర్ ను, చరణ్ పై ఒక టీజర్ ను కట్ చేసి రిలీజ్ చేశారు. ఒక స్టార్ హీరో సినిమా టీజర్ కి ఏ రేంజ్ వ్యూస్ వస్తాయో.. అన్నే వ్యూస్ ఎన్టీఆర్ – చరణ్ ల టీజర్స్ కి వచ్చాయి.
అంటే.. ఆర్ఆర్ఆర్ టీజర్స్ అని వాటికీ ప్రత్యేక వ్యూస్ ఏమి రాలేదు. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం.. రాజమౌళి జాగ్రత్తగా సినిమాని ప్లాన్ చేయకపోతే.. బాక్సాఫీస్ వద్ద ఆశాభంగం కలగకమానదు అని సెలవిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే నెల తిరిగే సరికి ‘దోస్తీ’ పాటని జనం మర్చిపోయారు. అలాగే అంతకు ముందు టీజర్స్ కూడా జనానికి గుర్తు లేవు. వీటిన్నింటిని బట్టి ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి లెక్కలు తారుమారు అయ్యేలా ఉన్నాయి.