ఎస్.ఎస్. రాజమౌళి.. సీరియల్ డైరెక్టర్ నుండి నేషనల్ డైరెక్టర్ గా ఎదిగిన గ్రేట్ డైరెక్టర్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా చేస్తోన్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ దసరా సందర్భంగా 2021 అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల అవుతున్నట్లు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ప్రకటించింది. అయితే దసరా టైమింగ్ విషయానికొస్తే.. దసరా నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు తొలగిపోనున్నాయి. అప్పటికి కరోనా పోతుంది, పైగా దసరా హాలిడేస్.. ఇలా రెండూ కలిసొచ్చేలా డేట్ ఫిక్స్ చేసుకున్నాడు రాజమౌళి.
Also Read: షాకింగ్: సాయిధరమ్ ‘రిపబ్లిక్’ టీజర్
ఇక చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో రాజమౌళి ఈ సినిమా కోసం ప్రపంచస్థాయి నటీనటుల్ని తీసుకున్నాడు. సినిమాలోనే ప్రధాన పాత్ర కోసం ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. పైగా సినిమాలో ఈమెనే ప్రధాన విలన్ అట. బ్రిటిష్ సంస్థానంలో ప్రముఖ అధికారిణిగా ఉండే ఈమె.. నల్లజాతి అంటూ భారతీయుల పై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటుందని.. అలాగే అలిసన్ డూడీ కుమార్తె ఒలీవియా మోరిస్ అని.. భారతీయులను నిత్యం అసహ్యించుకునే ఈమె.. తన కూతురు కొమరం భీమ్ తో ప్రేమలో పడటం అస్సలు తట్టుకోలేకపోతుందని తెలుస్తోంది.
Also Read: లవ్ స్టోరీ కోసం నాని ‘టక్ జగదీష్’ వాయిదా?
దాంతో ఈమె చేసే పనులు వల్లే.. భీమ్ పై అటాక్ లు జరుగుతాయని.. పులితో చేసే ఫైట్ కూడా ఈమె వల్ల జరుగుతుందని.. ఇదే సినిమాలో ఈమె ట్రాక్ అని తెలుస్తోంది. ఇక అజయ్ దేవగన్, శ్రియ శరన్, సముద్రఖని, అలియా భట్ లాంటి నటీ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. భారీ వ్యయంతో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్