టాలీవుడ్ సింగర్ సునీత గానంతోనే కాకుండా తన అందంతో కూడా అభిమానుల మనసులని దోచుకుంది. చూసిన వాళ్ళు ఆమెకి 42 ఏళ్ళ వయస్సు, ఇద్దరు పిల్లల తల్లి అంటే అవాక్కవటం ఖాయమనే చెప్పాలి. కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సింగర్ సునీత ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో డైవర్స్ తీసుకుని తన తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నారు. ఈనెల 9న శంషాబాద్ లోని సీతారాముల గుడిలో హిందూ సంప్రదాయ ప్రకారం సునీత రెండో వివాహం వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో జరిగింది.
Also Read: షాకింగ్: సాయిధరమ్ ‘రిపబ్లిక్’ టీజర్
మొదట్లో సునీత పెళ్లిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. కొందరు సునీత,రామ్ దంపతులను అభినందిస్తుంటే… మరికొందరు రెండో పెళ్లి మీద సునీతను విమర్శించారు. సునీత పెళ్లి ఫోటోలపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ కూడా చేసి వారి కుసంస్కారాన్ని బయట పెట్టారు. ఇవేమి పట్టించుకోకుండా నూతన దంపతులు తమ దాంపత్య జీవితాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉన్నారు.
Also Read: రెండూ కలిసొచ్చేలా ప్లాన్ చేసిన రాజమౌళి !
తాజాగా సునీత యూట్యూబ్ ఛానల్ లో వెడ్డింగ్ టీజర్ ని విడుదల చేసి అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు. నిశ్చితార్థం నుండి మెహందీ వరకు ఇంట్లో జరిగిన వేడుకలలోని కొన్ని స్పెషల్ మూమెంట్స్ ని పొందుపరిచిన వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఒక కుర్రమ్మాయి లాగా అల్లరి చేస్తూ అందంగా, ఆనందంగా కనిపించిన సునీతని చూస్తూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్