https://oktelugu.com/

Rajamouli: మహేష్ బాబు తో చేసే సినిమా కోసం మళ్లీ అదే ఫ్యాక్టరీ ని ఫాలో అవుతున్న జక్కన్న…

కాబట్టి బాహుబలి సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీ లో కొంత భాగాన్ని తీసుకోని అక్కడ భారీ సీట్లు వేసి సినిమాని షూట్ చేశారు. అలాగే త్రిబుల్ ఆర్ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక సపరేట్ సెట్ ను కూడా వేయించి అక్కడ షూట్ చేశారు.

Written By:
  • Gopi
  • , Updated On : March 18, 2024 / 09:33 AM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తన హవాని చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తాను చాటుకున్న రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమాని పాన్ వరల్డ్ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు.

    ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం మహేష్ బాబు తో ఆయన చేసే ప్రాజెక్టు మీద మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక దానికి తగ్గట్టుగానే రాజమౌళి తను చేసే ప్రతి విషయాన్ని పాన్ వరల్డ్ లెవెల్లో పబ్లిసిటీ చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు ఈ సినిమాలో అడ్వెంచర్స్ చేయబోతున్నట్టుగా తెలియజేశారు. అలాగే ఈ సినిమా ఆఫ్రికా అడవుల్లో ఉండబోతున్నట్టుగా కూడా హింట్స్ అయితే ఇస్తున్నారు. ఇక ఈ సినిమాలో న్యూజిలాండ్ కి చెందిన హీరోయిన్ నటించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో రాజమౌళి మాత్రం సినిమా మీద ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వడం లేదు. ఇక ఇది ఇలా ఉంటే రాజమౌళి తీసే సినిమాలు భారీ సెట్లతో కూడుకొని ఉంటాయి.

    కాబట్టి బాహుబలి సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీ లో కొంత భాగాన్ని తీసుకోని అక్కడ భారీ సీట్లు వేసి సినిమాని షూట్ చేశారు. అలాగే త్రిబుల్ ఆర్ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక సపరేట్ సెట్ ను కూడా వేయించి అక్కడ షూట్ చేశారు. ఇక అదే బాటలో మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీ నుంచే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక మొదటి షెడ్యూల్ ని కూడా ఇక్కడే స్టార్ట్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మే నెలలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి…ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా డైరెక్టర్ గా మంచి గుర్తింపును తెచ్చుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…