Rajamouli: 1000 కోట్లు ఇచ్చిన అలాంటి పని అస్సలు చేయను అంటున్న రాజమౌళి…

Rajamouli: మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన ఆయన ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

Written By: Gopi, Updated On : July 6, 2024 6:09 pm

Rajamouli who says that he will not do such work after giving 1000 crores

Follow us on

Rajamouli: తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లిన ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి…ప్రస్తుతం రాజమౌళి పాన్ వరల్డ్ సినిమాను చేస్తున్నాడు. ఇక ఆయన ఇచ్చిన ఉత్సాహంతోనే మిగితా దర్శకులందరు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటుంటే, ఆయన మాత్రం ఇప్పుడూ పాన్ వరల్డ్ సినిమా చేసి వరల్డ్ లో ఉన్న టాప్ డైరెక్టర్ లందరికీ పోటీని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన ఆయన ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇక తన ఓపెనియన్ ను చాలా ఓపెన్ గా పంచుకున్నాడు. ఇక అందులో ముఖ్యంగా తన హీరోల సెలెక్షన్ విషయంలో ఎవరు ఏం చెప్పినా వినకుండా తన కథ లోని క్యారెక్టర్ కి ఎవరైతే బాగుంటారో వాళ్లను మాత్రమే సెలెక్ట్ చేసుకొని వాళ్లతోనే సినిమా చేస్తానని చెప్పాడు. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తానని చెప్పాడు.

అందులో భాగంగానే హీరోయిన్ కి ఇంతకుముందు ఫ్లాపులు ఉన్నాయా హిట్లు ఉన్నాయా అనే విషయాన్ని అసలు పట్టించుకోనని చెబుతూనే, తన సినిమాలోని క్యారెక్టర్ కి ఆమె కరెక్ట్ గా సరిపోతుంది. ఆ పాత్రకు ఆమె తప్ప ఎవ్వరూ సెట్ ఎవ్వరూ అనుకున్నప్పుడు ఆమెకు పది ఫ్లాపులు ఉన్న పది హిట్లున్న అవేవి పట్టించుకోను నా సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటాను. ఇక హీరోయిన్లను సెలెక్ట్ చేసే విషయంలో ప్రొడ్యూసర్స్ మాట కూడా అసలు వినను.

నా సినిమాలోని క్యారెక్టర్ కి సెట్ అవ్వని హీరోయిన్ ని తీసుకోమ్మని ప్రొడ్యూసర్ రికమెండ్ చేసిన నేను తీసుకోను దానికోసం నాకు ఆయన 1000 కోట్ల రూపాయలు ఇస్తానన్నా కూడా నేను అలాంటి పని చేయను అని రాజమౌళి కరాకండిగా చెప్పడం ఇప్పుడు నెట్టింట్టా హాట్ టాపిక్ గా మారింది…