Salaar: ఇండియా వైడ్ సలార్ మేనియా నడుస్తుంది. విడుదలకు మరో వారం సమయం మాత్రమే ఉంది. సినిమా లవర్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ టాక్ లీక్ అయ్యింది. ఆల్రెడీ కొందరు సినిమా చూశారు. అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సలార్ మూవీ చూసిన సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. సలార్ తో ప్రభాస్ హిట్ దాహం తీరనుంది. బాక్సాఫీస్ బద్దలవుతుంది విశ్వాసం ప్రకటిస్తున్నారు. ఈ ప్రచారం సలార్ పై అంచనాలు మరింత పెంచేస్తుంది. ఆన్లైన్లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుబోతున్నాయి.
ఇక యూనిట్ సలార్ ప్రొమోషన్స్ పై మరింత వేగవంతం చేశారు. ఏస్ డైరెక్టర్ రాజమౌళి సలార్ చిత్ర ఫస్ట్ టికెట్ కొన్నారు. ఆర్ టి ఎక్స్ రోడ్ లో గల ప్రముఖ థియేటర్ సంధ్య 70 ఎంఎం లో ఉదయం రూ. 7 గంటల షో టికెట్ రాజమౌళి కొనుగోలు చేశారు. ఈ టికెట్ ని దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రభాస్, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ రాజమౌళికి స్వయంగా అందించారు. అయితే ఈ టికెట్ ధర సాధారణం కాదట.
అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి ఈ టికెట్ కి రూ. 10116 చెల్లించాడని సమాచారం. దీంతో ఇది హాట్ టాపిక్ అయ్యింది. కాగా ప్రభాస్ సలార్ మూవీ ప్రమోషన్స్ లో పెద్దగా పాల్గొనలేదు. విదేశాల్లో ప్రభాస్ కి మోకాలి ఆపరేషన్ జరిగింది. నెల రోజుల పాటు అక్కడే రెస్ట్ తీసుకున్నారు. తిరిగి వచ్చిన ప్రభాస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. సలార్ ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొనడం లేదు.
అయితే రాజమౌళి, ప్రభాస్ లపై ఒక ఇంటర్వ్యూ షూట్ చేశారట. అది ప్రసారం చేయనున్నారట. సలార్ మూవీకి ప్రభాస్ చేసే ప్రచారం ఇక అదే అంటున్నారు. ఆదిపురుష్, రాధే శ్యామ్, సాహో చిత్రాల ప్రమోషన్స్ కోసం ప్రభాస్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. సలార్ విషయంలో ఆయన అంత శ్రద్ధ చూపలేదు. బహుశా ఆల్రెడీ హైప్ ఉందని కావచ్చు. సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.