Salaar First Review: ప్రభాస్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశంలోనే పరిచయం అవసరం లేదు. అభిమానుల గుండెల్లో గూడు కట్టుకొని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. రీసెంట్ గా వచ్చిన అన్ని సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా.. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇదే క్రమంలో త్వరలోనే సలార్ రిలీజ్ కు సిద్ధమవడంతో మరింత సంతోషపడుతున్నారు ఆయన అభిమానులు. ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది.
సలార్ సినిమాకు సంబంధించిన ఓ రివ్యూ వచ్చేసింది. అయితే ఈ సంవత్సరం రూ. 1000 కోట్ల సినిమా తెలుగు రాష్ట్రాల్లో లేదనే చెప్పాలి. ఈ సలార్ సినిమాతో ఆ లోటు తీరుతుందని టాక్. అంతే కాదు పాజిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఈ కథ అద్భుతాలను సృష్టిస్తుందని.. ప్రభాస్ ఖాతాలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ పక్కా అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటి వరకు ఓ ప్రభాస్ ఇప్పుడు రాబోతుంది మరో ప్రభాస్.. అంటూ తెలుస్తోంది. దీంతో ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు వస్తుందంటూ ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లలో ప్రసారం అవుతాయని టాక్. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్స్ కూడా వేగం పుంజుకున్నాయి. అంతేకాదు సలార్ 2 షూటింగ్ కూడా వచ్చే సంవత్సరం మొదలవుతుందని తెలియడంతో మరింత సంతోషపడుతున్నారు ప్రభాస్ అభిమానులు. అయినా ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో సినిమా అంటే ఆ మాత్రం ఎదురుచూపులు ఉండాల్సిందే అంటున్నారు ఇద్దరి అభిమానులు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఏ పండుగ సందర్భంగా రిలీజ్ అయినా కూడా హిట్ పక్కా. ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మరో సినిమా గనుక విడుదలైతే ఆ సినిమా ఫ్లాప్ అవడం పక్కా అంటూ కూడా కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో…