Chhaava : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి (Rajamouli) ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా పరిధి దాటి పాన్ వరల్డ్ లో మహేష్ బాబు (Mahesh Babu) ని హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఈ సినిమాకి సంబంధించిన షూట్ ని కూడా రాజమౌళి చాలా రహస్యంగా చేస్తూ ముందుకు సాగుతున్నాడు. రాజమౌళి లాంటి దర్శకుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన మార్క్ ను చూపించాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించడమే కాకుండా తెలుగు వాళ్ళు ఎందులో తక్కువ కాదని మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం… ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఛత్రపతి శివాజీ కొడుకు అయిన శంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఒక యాక్షన్ ఎమోషనల్ డ్రామా సినిమాని తెరకెక్కించాలనే ప్రయత్నం చేశాడు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ లో విక్కీ కౌశల్ (Vicky Koushal) హీరోగా ఛావా (Chavaa) అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. రాజమౌళి కనక ఈ సినిమాను చేసి ఉంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉండేదని ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అయినప్పటికి ఛావా సినిమాకి చాలా మంచి గుర్తింపైతే రావడం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కదిలించడంతో ఈ సినిమాకి మౌత్ పబ్లిసిటీ కూడా బాగా హెల్ప్ అవుతుంది.
ఇక ఇప్పుడు భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు సాగుతోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో విక్కీ కౌశల్ ఒక భారీ విజయనన్నైతే అందుకున్నాడు. మరి రాజమౌళి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా సినిమాని అయితే చేయలేకపోయాడు. ఛత్రపతి శివాజీ కథను మన తెలుగు స్టార్ హీరోల్లో ఎవరో ఒక్కరితో చేసి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
అయితే రాజమౌళి శంభాజీ మహారాజ్ సినిమాని అనుకున్నప్పుడు అందులో హీరోగా రామ్ చరణ్ ని తీసుకోవాలనే ప్రయత్ననైతే చేశాడు. కానీ రాజమౌళి కి ఉన్న కమిట్ మెంట్స్ వల్ల ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇక దానికి సంబంధించిన అద్భుతమైన స్టోరీ కూడా విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక మొత్తానికైతే శంభాజీ మహారాజ్ సినిమాని రాజమౌళి చేయకపోవడంతో బాలీవుడ్ వాళ్లు ఆ సినిమాని తెరకెక్కించారు. ఇక ఏది ఏమైనా కూడా మరాఠా సామ్రాజ్యాధినేత అయిన శంభాజీ జీవిత కథ జనాలకు తెలిస్తే సరిపోతుంది. కాబట్టి ఎవరు సినిమా చేసినా కూడా పర్లేదు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…