Today Horoscope In Telugu: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. ఇందులో భాగంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి విశేషాలు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. మరికొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఇతరుల వద్ద అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. అర్హులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్రలకు వెళ్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కొందరు బంధువులు ఇంటికి రావడంతో ఇల్లు సందడిగా ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తపెట్టబడులు పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల అధిక ఆదాయాన్ని పెంచుకునే మార్గం పెంచుకోవాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు. కొందరు లక్ష్యాలను పూర్తి చేయడంతో పదోన్నతిని పొందేందుకు అవకాశం ఉంటుంది. విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రత్యేక అతిధులు ఇంటికి వస్తారు. జీవితం భాగస్వామితో వ్యాపారం చేసేవారు అధిక లాభాలు పొందుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడును పెడతారు. కొన్ని కారణాలవల్ల ఖర్చులు పెరుగుతాయి. అయితే వ్యాపారులు జాగ్రత్తగా ఆదాయ వ్యవహారాలు జరపాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వ్యాపారులు ఈరోజు బిజీ వాతావరణం లో గడుపుతారు. సాయంత్రం ఇంటికి అతిధులు వస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేయడంలో కష్టపడతారు. వ్యాపారులకు అధికంగా లాభాలు ఉంటాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎవరితోనైనా వాగ్వాదం ఉంటే ఓపిక పట్టాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటే మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులు సీనియర్లతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. దీంతో మానసికంగా ఆందోళనగా ఉంటారు. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న అనారోగ్యం కలిగిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : వ్యాపారులకు లాభాలు రావాలంటే కాస్త కష్టపడాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. కొన్ని ఖర్చులు పెరగడంతో ఆందోళనతో ఉంటారు. అధిక ఆదాయాన్ని అర్జించేందుకు ఉద్యోగులు మరో ఉద్యోగం మారాల్సి వస్తుంది. విద్యార్థులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. తెలివిగా వ్యవహరించడంతో లాభాలు ఎక్కువగా పొందుతారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని చేసే పెట్టుబడులపై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు పెద్దల సలహా తీసుకోవాలి. కొన్ని కారణాలవల్ల దూర ప్రయాణాలు ఉంటాయి. ఇవి లాభాలను తెచ్చి పెడతాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : విద్యార్థులు నిరాశతో ఉంటారు. అయితే వారికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండడంతో అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. కొన్ని రంగాల్లో అనుకున్న పలితాలు పొందుతారు. వ్యాపారులు మానసికంగా ఒత్తిడితో కలిగి ఉంటారు. ఉద్యోగులకు కొత్త పనిని ప్రారంభించేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే కొన్ని పనుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బంధువుల్లో ఒకరి నుంచి తన సహాయం అందుతుంది.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ప్రయాణాలు చేసేవారు అజాగ్రత్తగా ఉండకూడదు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే వెనుకడుగు వేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు జరిపేవారు డబ్బులు పొదుపు చేయాలి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు దీంతో ఉల్లాసంగా ఉంటారు. పాత స్నేహితులు కలవడంతో కొత్త వ్యాపారం గురించి చర్చిస్తారు. కొందరు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో ఆర్థిక వ్యవహారాలు అప్పుడే జరపకుండా ఉండాలి. విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు..
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : రాజకీయ రంగాలతో సంబంధం ఉన్నవారు ఈరోజు అనుకూల సమయం. మీరు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు పదోవ్రతలు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందుతారు. మానసికంగా దృఢంగా తయారవుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి. అయితే జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. ఈ సమయంలో ఓపిక పట్టడమే మంచిది. సోదరుల సహాయంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ ఇస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరికి మద్దతుగా బంధువులు వస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : వ్యాపారులకు రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రాశి వ్యాపారులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. అదనపు ఆదాయం పెరగడంతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.