Rajamouli Varanasi Movie Budget: రాజమౌళి చేస్తున్న ప్రతి సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉంటాయి. కారణం ఏంటి అంటే ఆయన చేసే ప్రతి సినిమాలో భారీ విజువల్స్ ఉండడమే కాకుండా ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంటాడు. కాబట్టి ప్రతి ప్రేక్షకుడు ఆయన సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సినిమా సినిమాకి బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ‘వారణాసి’ సినిమా కోసం 1300 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీని ద్వారా ఆయన ఏ రేంజ్ కలెక్షన్స్ ని సాధిస్తాడు అనేది ప్రతి ఒక్కరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజానికి బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్ చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!
కాబట్టి దాని బిజినెస్ స్ట్రాటజీని కూడా మార్చినట్టుగా తెలుస్తుంది. 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 3000 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాలి. లేకపోతే ప్రొడ్యూసర్స్ భారీగా నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లే రాజమౌళి సైతం ఈ సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…
సినిమా ప్రమోషన్ స్టార్ట్ అవ్వగానే ఈ సినిమాని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరితో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేయిస్తారట. తద్వారా ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే రీతిలో బిజినెస్ స్ట్రాటజీ లను ప్లాన్ చేస్తానని తన సన్నిహితుల దగ్గర రాజమౌళి చెబుతున్నట్టుగా తెలుస్తుంది.
రాజమౌళి ఇంతకుముందు చేసిన సినిమాల ప్రమోషన్స్ ను సైతం చాలా భారీగా చేపట్టి ఆ సినిమాను మొదటి రోజు చూడకపోతే వేస్ట్ అనిపించేలా ప్రేక్షకుల్లో ఒక కుతూహలాన్ని కలిగించాడు. ఇక వారణాసి విషయంలో కూడా అదే రిపీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇప్పటికే ఈ సినిమా మీద హైప్ ను తారస్థాయికి తీసుకెళ్తున్న రాజమౌళి సినిమా ప్రమోషన్స్ సమయంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి…
