Homeఎంటర్టైన్మెంట్Balakrishna: బాలయ్య కి భారీ హిట్స్ ఇచ్చినవాళ్లే...ఆయనకి భారీ ప్లాపులు ఇచ్చారా..?

Balakrishna: బాలయ్య కి భారీ హిట్స్ ఇచ్చినవాళ్లే…ఆయనకి భారీ ప్లాపులు ఇచ్చారా..?

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏ సినిమా చేసినా కూడా అదొక ట్రెండ్ సెట్టర్ గా మిగులుతుంది. ఆయన భారీ సక్సెస్ లను సాధిస్తూ చిరంజీవికి ఎప్పటికప్పుడు పోటీని ఇస్తున్నాడు. ఒకప్పుడు బాలకృష్ణ చేసిన సినిమాల్లో వైవిద్య భరితమైన కథాంశాలైతే ఉండేవి. కానీ ఇప్పుడు ఆయన పూర్తిస్థాయి మాస్ కమర్షియల్ సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ఇక ఎందుకని ఆయన వైవిధ్యం చూపించడం లేదు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అయితే బాలయ్య బాబుకి ఈ […]

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏ సినిమా చేసినా కూడా అదొక ట్రెండ్ సెట్టర్ గా మిగులుతుంది. ఆయన భారీ సక్సెస్ లను సాధిస్తూ చిరంజీవికి ఎప్పటికప్పుడు పోటీని ఇస్తున్నాడు. ఒకప్పుడు బాలకృష్ణ చేసిన సినిమాల్లో వైవిద్య భరితమైన కథాంశాలైతే ఉండేవి. కానీ ఇప్పుడు ఆయన పూర్తిస్థాయి మాస్ కమర్షియల్ సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ఇక ఎందుకని ఆయన వైవిధ్యం చూపించడం లేదు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అయితే బాలయ్య బాబుకి ఈ దర్శకులైతే సూపర్ సక్సెస్ లను అందించారో డిజాస్టర్ లను కూడా కట్టబెట్టారనే విషయం మనలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా బి.గోపాల్ లాంటి దర్శకుడు ‘రౌడీ ఇన్స్పెక్టర్’ , ‘లారీ డ్రైవర్’, ‘నరసింహ నాయుడు’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందించి ఆ తర్వాత ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ అనే ఒక డిజాస్టర్ సినిమాని కట్టబెట్టాడు.

Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!

దాంతో బాలయ్య చాలావరకు ఆ సినిమాకు సంబంధించిన సన్నివేశాలలో కొన్ని ట్రోల్స్ ను సైతం ఎదుర్కున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య ఆ తర్వాత బోయపాటి డైరెక్షన్లో వరుస సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటివరకు వాళ్ళిద్దరి కాంబినేషన్ లో నాలుగు సినిమాలు రాగా, సింహా, లెజెండ్, అఖండ మూడు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి.

ఇక ‘అఖండ 2’ సినిమా భారీ డిజాస్టర్ గా మారడంతో బాలయ్య బాబు క్రేజ్ సైతం పడిపోయిందనే చెప్పాలి… ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తుందా? లేదా అనేది కూడా డౌట్ గానే కనిపిస్తుంది. ఒకప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అభిమానులు అలాగే ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపించేవారు.

కానీ ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ మరింత డీలా పడిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం బోయపాటి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక బాలయ్య సైతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper