Venezuela Vs USA: వెనిజులా జనాభా మూడున్నర కోట్లు.. స్థానిక సామర్థ్యం కూడా లక్ష ఉంటుంది. ఆ సైనికులకు అంతగా యుద్ధాలు చేసిన అనుభవం లేదు. అటువంటి ఆ దేశం మీద అమెరికా ఉన్నట్టుండి దాడి చేసింది. దీనికి మాదక ద్రవ్యాల మీద చేస్తున్న పోరాటమని కలరింగ్ ఇచ్చింది. మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకోవడానికి గోడ కడుతున్న అమెరికాకు.. వెనిజులా ప్రాంతం నుంచి మాదకద్రవ్యాలను అడ్డుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ అమెరికా ఆ పని చేయకుండా ఏకంగా దాడి చేసింది. వెనిజులా అధ్యక్షుడిని సతీసమేతంగా అరెస్ట్ చేసింది. అమెరికా చేసిన ఈ దుశ్చర్య ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేవిధంగా చేసింది.
వెనిజులా పై దాడి వెనుక అనేక కారణాలు
అమెరికా అలా చేయడం వెనుక అనే కారణాలు ఉన్నాయి. వెనిజుల ప్రాంతంలో దాదాపు 6 బిలియన్ బ్యారల్స్ చమురు నిల్వలు ఉన్నాయి. ఇక్కడి నుంచి చైనాకు ప్రతిరోజు ఆరు మిలియన్ బ్యారెల్ చమురు వెళ్తూ ఉంటుంది. దీంతోపాటు చైనా ఇరాన్ దేశం నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. తన అవసరాల్లో 12 శాతం ఇరాన్ నుంచి సేకరిస్తూ ఉంటుంది.
చైనాను అష్టదిగ్బంధనం చేసేందుకు..
వాస్తవానికి చైనా నుంచి అమెరికాకు ఎప్పటినుంచో ముప్పు పొంచి ఉంది. పైగా తన చుట్టూ ఉన్న దేశాలలో అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో చైనా విజయవంతమైంది. ప్రపంచంలోనే సెమీ కండక్టర్ లీడర్ గా ఉన్న తైవాన్ మీద చైనా ఎప్పుడో కన్ను వేసింది. తైవాన్ తమ దేశంలో భూభాగమని ప్రకటించింది. ఇప్పటికే అక్కడ అన్ని వ్యవస్థలలో వేలు పెట్టడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. చైనా చేస్తున్న ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పి కొట్టడానికి అమెరికా తైవాన్ కు అండగా నిలవడం మొదలుపెట్టింది. అత్యంత ఖరీదైన ఆయుధాలను, మిస్సైల్స్ ను సరఫరా చేసింది. ఒకవేళ గనుక తైవాన్ మీద చైనా దాడి చేస్తే అమెరికా నేరుగా రంగంలోకి వస్తుంది. అందువల్లే చైనా కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒకవేళ చేయ గనుక తైవాన్ దేశాన్ని పూర్తిస్థాయిలో ఆక్రమించుకుంటే అప్పుడు సెమీ కండక్టర్ల విషయంలో చైనా మీద అమెరికా ఆధార పడాల్సి ఉంటుంది. దీనికి తోడు రేర్ ఎర్త్ మినరల్స్ వ్యాపారంలో చైనా నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పుడు అమెరికా తన అవసరాల కోసం రేర్ ఎర్త్ మినరల్స్ ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నది. తైవాన్ దేశాన్ని చైనా గనుక ఆక్రమిస్తే అమెరికాకు ఇబ్బందికరమైన వాతావరణ ఏర్పడుతుంది. అందువల్లే చైనాను అష్టదిగ్బంధం చేయడానికి అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
అందుకే అమెరికా ఉక్కు పిడికిలి
ముందుగా చైనాకు అనుకూలంగా ఉన్న శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, ఇంకా చిన్న చిన్న దేశాలలో ఉన్న ప్రభుత్వాలను కూలగొట్టింది. చివరికి నైజీరియా ప్రాంతం నుంచి చైనాకు చమురు వెళ్తోందని భావించిన అమెరికా.. అక్కడ కూడా దాడులు మొదలుపెట్టింది. చివరికి ఇరాన్లో కూడా సంక్షోభాన్ని రేకెత్తించింది. తద్వారా చమురు వ్యాపారం మీద అమెరికా ఉక్కు పిడికిలి బిగించింది. భవిష్యత్తు కాలంలో చైనా రేర్ ఎర్త్ మినరల్స్, తైవాన్ దేశాన్ని ఆక్రమించి సెమీ కండక్టర్ల వ్యాపారంలో ఏకపక్ష విధానాన్ని సాగిస్తే అమెరికాకు చాలా ఇబ్బంది. అందువల్లే చైనాకు ఇప్పటినుంచే అమెరికా చుక్కలు చూపించడం మొదలుపెడుతోంది.
చమురు వ్యాపారంలో..
ముఖ్యంగా చమురు వ్యాపారంలో నెంబర్ వన్ స్థానంలో ఉండేందుకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే వెనిజులా ప్రాంతంలో అమెరికా కంపెనీలు చమురు వ్యాపారం చేస్తాయని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకారం చూసుకుంటే భవిష్యత్ కాలంలో చైనా తన చమురు అవసరాలకు అమెరికా మీద ఆధారపడాల్సి ఉంటుంది. అందువల్ల సెమి కండక్టర్లు, రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో అమెరికాకు చైనా ఎట్టి పరిస్థితిలో హ్యాండ్ ఇవ్వదు.
ముందు జాగ్రత్తగా..
భవిష్యత్తు కాలంలో చైనా నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి అమెరికా ముందుగానే జాగ్రత్త పడింది. చుట్టూ ఉన్న దేశాలలో తమ అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంది అమెరికా. తద్వారా చైనా ను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వెనిజులపై దాడి కూడా అటువంటిదే. మరి దీనికి చైనా ఎటువంటి కౌంటర్ ఇస్తుంది? తైవాన్ విషయంలో ఏం చేస్తుంది? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.