SSMB 29: ఒక సినిమా వచ్చింది అంటే దాని ఇంపాక్ట్ కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకుల్లో ఉండాలి. అలాంటి ఎఫెక్టివ్ సినిమాను చేసినప్పుడే దర్శకులకు గొప్ప గుర్తింపు వస్తోంది. ప్రస్తుతం రాజమౌళి లాంటి దర్శకుడు సైతం ఇప్పుడు గొప్ప క్రేజ్ ను సంపాదించుకొని తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని తన అభిమానులుగా మార్చుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. అందుకే మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటి ఉన్న ఈ దర్శకుడు ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
ఇక మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ ని కూడా రాజమౌళి ఇప్పటివరకు ఇవ్వలేదు. రీసెంట్గా పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టరైజేషన్ కి సంబంధించిన క్లారిటీని ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికి అది ప్రేక్షకులను అంత పెద్దగా మెప్పించలేకపోయింది. దాంతో నవంబర్ 15వ తేదీన మహేష్ బాబు లుక్కు అలాగే ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ను టైటిల్ ని కూడా రివిల్ చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికైతే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మరో మెట్టు పైకి ఎక్కబోతోంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేయడానికే నవంబర్ 15వ తేదీన ఒక ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా కండక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఈ ఈవెంట్లో మహేష్ బాబు యొక్క క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది.
అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి? అనేది తెలపడానికి వాళ్లు సిద్ధమవుతున్నారు… ఇక ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఒక ట్రెండ్ ను క్రియేట్ చేస్తే, ఇది మరొక ట్రెండ్ కి తెర లేపబోతుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి దానికి అనుగుణంగానే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. తద్వారా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది అనేది తెలియాలంటే మాత్రం మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…