Chandrababu: విశాఖలో( Visakhapatnam) పెట్టుబడుల సదస్సు జరగనుంది. ఈనెల 14 నుంచి రెండు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలు, దేశీయ, విదేశీ ప్రతినిధులు, వాణిజ్య వేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈవోలు.. ఇలా అంతా క్యూ కట్టనున్నారు. దీంతో ప్రపంచం చూపు విశాఖపట్నం పై పడనుంది. కీలక ఒప్పందాలు జరగనున్నాయి. పెట్టుబడుల కు స్వర్గధామం గా విశాఖ నిలవనుంది. అయితే ఇప్పటివరకు విశాఖలో నాలుగు పెట్టుబడుల సదస్సులు జరిగాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విశాఖ వేదికగా సిఐఐ ఆధ్వర్యంలో మూడుసార్లు పెట్టుబడుల సదస్సు నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో సొంతంగానే.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించారు. అయితే సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన పెట్టుబడుల సదస్సులో జరిగిన ఒప్పందాలే అమలు జరిగాయి. జగన్ సర్కార్ అమలు చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనుకున్న స్థాయిలో పెట్టుబడులు రా పెట్టలేకపోయింది.
* అప్పట్లో కేంద్రం సహకారంలే..
నవ్యాంధ్రప్రదేశ్ లో ఈ తరహా ప్రయత్నాలు అప్పట్లో జరగలేదు. కేంద్ర ప్రభుత్వం( central government) సైతం అనుకున్న స్థాయిలో సహకారం అందించలేదు. ఈసారి ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి కావడం.. రాజకీయ తప్పిదాలకు గుణపాఠాలు నేర్చుకోవడం ఏపీకి కలిసి వచ్చేలా ఉన్నాయి. విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ఒక రకమైన అనుకూల వాతావరణం ఏర్పడడానికి ముమ్మాటికి గూగుల్ డేటా సెంటర్ కారణం. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఒప్పందం జరగడం ఈ పెట్టుబడుల సదస్సుకు సరికొత్త శోభను ఇచ్చింది. తద్వారా మిగతా ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చేందుకు ఇది ఎంతగానో దోహద పడింది. ఒక్క ఐటీ రంగం కాదు దాని అనుబంధ రంగాలు సైతం ఏపీకి వచ్చేందుకు చాలా ఆసక్తి చూపుతున్నాయి. ఈ సదస్సు ద్వారా పెట్టుబడులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
* వైసీపీ హయాంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మేట్..
జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్( Global investor submit ) నిర్వహించారు. వైసిపి హయాంలో పారిశ్రామిక అభివృద్ధి జరగలేదన్న విమర్శలు వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక సమ్మిట్ నిర్వహించింది. అది కూడా సరిగ్గా ఎన్నికలకు ముందు 2023లో. చాలా రకాల ఒప్పందాలు జరిగాయి. పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వైసిపి ప్రభుత్వం చెప్పింది. కానీ దానికి కార్యాచరణ ప్రారంభం కాకమునుపే ఎన్నికలు వచ్చాయి. అధికార మార్పిడి జరిగింది. దీంతో ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఈ అనుభవాల దృష్ట్యా ముందుగానే చంద్రబాబు సర్కార్ మేల్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలను రప్పించి.. ఒప్పందాలు చేసుకొని.. పెట్టుబడులు పెట్టేలా ముందుగా వారిని ఒప్పించింది.
* కొన్ని పరిశ్రమల ఏర్పాటు..
అంతకుముందు మూడుసార్లు చంద్రబాబు ( CM Chandrababu) హయాంలో పెట్టుబడుల సదస్సులు జరిగాయి. అప్పట్లో అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణ జరపాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఈ మూడు సార్లు జరిగిన సదస్సుల పుణ్యమా అని కొన్ని రకాల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అలా వచ్చిందే అనంతపురం కియా పరిశ్రమ. చాలా రకాల పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఒప్పందాలను రద్దు చేసింది. 25 శాతం లోపు పనులను గుర్తించి ఆపింది. అలాగని కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేయలేకపోయింది. అయితే గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు చాలా రకాలుగా ఆలోచించి.. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే కాదు.. వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నారు.