Rajamouli supports Tourist Family movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)…ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో రికార్డులన్నింటిని తిరగరాస్తు ముందుకు సాగుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన 13 సినిమాలు చేస్తే అందులో 13 సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి ఎలాగైనా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ లెవెల్ లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ రాజమౌళి మలయాళం సినిమా అయిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా బావుంది అందరూ చూడండి అంటూ ఒక ట్వీట్ చేయడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆయన ట్విట్ చేసి చాలా రోజులు అవుతున్నప్పటికి రీసెంట్గా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ అయిన జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాలో ఒక ఫ్యామిలీ శ్రీలంక నుంచి అక్రమంగా ఇండియాలోకి వచ్చి ఇక్కడ బతుకుతూ కొంతమందిని మారుస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళు ఇండియాలోనే ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని బతుకుతూ ఉంటారు. నిజానికి ఇలాంటివి సినిమాలుగా చూడ్డానికి బాగానే ఉంటాయి.
కానీ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇండియాలోకి చొరబడే రోహిగ్యాలకు ఇక్కడ ఐడెంటిటీ ఏర్పాటు చేసుకొని మన వాళ్లకు దక్కాల్సిన ప్రభుత్వ సేవలను వాళ్లు వాడుకుంటున్నారు. ఓటు బ్యాంకింగ్ నేపథ్యంలో వీళ్లను సపోర్ట్ చేసే వాళ్లు కూడా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్లకోసం మనలాంటి వాళ్ళు మనకు వచ్చే అవకాశాలను ఎందుకు కోల్పోవాలి.
అనే ఉద్దేశ్యంతో గత కొన్ని రోజులుగా ఇండియాలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ఈ సినిమా రావడం దానిని రాజమౌళి బాగుందని ప్రమోట్ చేయడం పట్ల సినిమా విమర్శకులతో పాటు సినిమా మేధావులు సైతం రాజమౌళిని విమర్శిస్తున్నారు. నిజానికి అక్రమంగా ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చిన కొంత మందిని మనం ఎందుకు భరించాలి.
వాళ్లు ఇక్కడి తిండి తింటూ వాళ్ల దేశానికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిని మనం ఎందుకు మన దేశంలో ఉండనివ్వాలి అనే ఉద్దేశ్యంతో ఉన్న మనవాళ్ళకి ఈ సినిమా కొంతవరకు నచ్చకపోవచ్చు అలాగే రాజమౌళి చేసిన ట్వీట్ కూడా వాళ్లకు ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి…