ఒక తెలుగు దర్శకుడిగా నేషనల్ స్థాయిలో భారీ స్టార్ డమ్ ను సాధించిన ఘనత ఒక్క ‘రాజమౌళి’కే దక్కుతుంది. ప్రపంచ వ్యాప్తంగా దర్శక ధీరుడు అనే బ్రాండ్ ను క్రియేట్ చేసుకోవడం అంటే మాటలా.. కానీ జక్కన్న సాధించాడు. ఇక రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పై పాన్ ఇండియా లెవల్లో ఫుల్ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ తో మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ పడింది. కాగా రాజమౌళి, తానూ మహేష్ తో చేయబోయే సినిమా సెట్స్ కోసం డిజైన్ చేయిస్తున్నాడని తెలుస్తోంది.
మహేష్ సినిమా పై వర్క్ చేయడానికి కారణం రాజమౌళి టైం వేస్ట్ చేయకూడదు అనే ఉదేశ్యమేనట. ఎలాగూ కరోనా సెకెండ్ వేవ్ దెబ్బకు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్లానింగ్ మొత్తం రివర్స్ అయిపోయింది కాబట్టి.. ఈ మధ్యలో వచ్చిన గ్యాప్ లో మహేష్ సినిమా పై జక్కన్న వర్క్ చేస్తున్నాడని సమాచారం. ఎప్పుడైతే రాజమౌళి తన నెక్ట్స్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడని, జక్కన్న క్లారిటీ ఇచ్చాడో ఇక అప్పటి నుండి ఈ సినిమా పై అనేక ఊహాగానాలు.. అనేక సిల్లీ కథనాలు బాగా వైరల్ అవుతూనే ఉన్నాయి.
తాజాగా ఇప్పుడు ఈ సినిమా సెట్ డిజైన్ అంటూ ఒక కొత్త రూమర్ వైరల్ అవుతుంది. అన్నట్టు ఈ సినిమా ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా రాబోతోందట. మహేష్ బాబు ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా నటిస్తున్నాడట. మరి ఈ రూమర్ లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఇక ప్రసుతం మహేష్ పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సగానికి ఈ సినిమా పూర్తయిపోతుంది. ఆ తరువాత రాజమౌళితో సినిమా చేసే అవకాశం ఉంటే చేసేయాలని మహేష్ ప్లాన్. మరి అప్పటిలోగా రాజమౌళితో మహేష్ సినిమా కుదురుతుందో లేదో చూడాలి.