
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, నటుడు విష్టు విశాల్ ఒక్కటయ్యారు. గురువారం మధ్యాహ్నం వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మొయినాబాద్ ఈ వేడుకకు వేదికైంది. కరోనా నేపథ్యంలో కొద్ది మంది బంధువులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఆ జంట గతేడాది సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.