తెలంగాణకు వ్యాక్సిన్ సరఫరా విషయంలో కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. గుజరాత్ తో పోలిస్తే తెలంగాణకు కేటాయించినదెంతో కేంద్రం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ తో ప్రపంచం అంతా అల్ల కల్లోలంగా మారిందన్నారు. తెలంగాణ ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని కొందరు ప్రైవేట్ హాస్పిటల్స్ వారు డబ్బులు చెల్లించలేని వారిని గాంధీకి పంపుతున్నారని అన్నారు. బ్లాక్ లో ఆక్సిజన్ సరఫరా చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.