Rajamouli Speech: ప్రభాస్(Rebel Star Prabhas),రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కిన వెండితెర అద్భుతం బాహుబలి రెండు భాగాలను కలిపి ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali : The Epic) అనే సినిమాగా ఎడిట్ చేసి నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక కొత్త సినిమా విడుదలైతే ఎలా ఉంటుందో, ఈ సినిమాకు అలాంటి హంగామా ఏర్పడింది. అందుకు కారణం రీ రిలీజ్ కి కూడా ఆడియన్స్ లో ఆసక్తి కలిగించేలా చేసిన రాజమౌళి ప్రొమోషన్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకు ముందు రెండు భాగాల్లో మనం చూడని సన్నివేశాలను జోడించి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. రెస్పాన్స్ అదిరిపోయింది. ఇది కదా అసలు సిసలు రీ రిలీజ్ అంటే, ఎంతైనా రాజమౌళి, రాజమౌళి నే అని అనిపించేలా చేసింది. ఎక్కడా కూడా పాత సినిమాని చూస్తున్న ఫీలింగ్ కలగలేదు, అదే రాజమౌళి మ్యాజిక్ స్పెషల్.
Also Read: ప్రభాస్ రెమ్యూనరేషన్ లో సగం ఆ అకౌంట్ కి వెళ్ళిపోతోందా..? కారణం ఏంటంటే..?
ఇకపోతే ఈ సినిమాని హైదరాబాద్ లో చూస్తే ప్రసాద్ ఐమాక్స్ లార్జ్ స్క్రీన్ లోనే చూడాలి అనే డిమాండ్ మొదటి నుండి ఉండేది. అంత పెద్ద స్క్రీన్ లో ఈ రేంజ్ హై క్వాలిటీ సినిమాని చూస్తే దానికి వచ్చే కిక్కే వేరు. హైదరాబాద్ లో ఏ థియేటర్ లో అయినా బాహుబలి టికెట్స్ దొరకొచ్చు ఏమో కానీ, ప్రసాద్ ఐమాక్స్ లార్జ్ స్క్రీన్ లో మాత్రం దొరికే ఛాన్స్ లేదు, అంత డిమాండ్ ఉంది. అయితే నిన్న ఈ థియేటర్ లో రాజమౌళి సర్ప్రైజ్ ఎంట్రీ గా లోపలకు వచ్చి కాసేపు అభిమానులతో ముచ్చటించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాటలను బట్టే చెప్పొచ్చు, రాజమౌళి ప్రొమోషన్స్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది. ఆయన థియేటర్ లోకి అడుగుపెట్టిన వెంటనే అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది.
ఆయన మాట్లాడుతూ ‘రాజమాత దేవసేన ఆజ్ఞలు ఎలా ఉన్నాయి?, బాహుబలి పాలన ఎలా ఉంది?, ఆ ముసలోడు(బిజ్జల దేవా) బ్రతకలేక, చావలేక, బానిస లాగా పడుండం మీ అందరికీ నచ్చిందా?’ అని సినిమా మోడ్ లో మాట్లాడుతాడు. దీనికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘బాహుబలి మీద మీరు చూపించిన ప్రేమ ఎనలేనిది. పదేళ్లు దాటినప్పటికీ కూడా ఈ సినిమాపై ఇంతటి ప్రేమ చూపిస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాలో మీరు నచ్చిన సన్నివేశాలన్నీ ఉంచుతూ, కొన్ని కొత్త సన్నివేశాలను జత చేసి విడుదల చేసాము. మీకు కచ్చితంగా నచ్చుతుంది అనే అనుకుంటున్నాను. ఎంజాయ్ చేయండి’ అంటూ రాజమౌళి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
